Hyderabad: తిక్క కుదిరింది.. గణేష్ మండపాల దగ్గర 51 మంది పోకిరీల అరెస్ట్
జనాల మధ్య చిల్లర వేశాలు వేస్తున్న ఆకతాయిల ఆటపట్టించేందుకు షీటీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని గణేష్ మండపాల దగ్గర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని షీ టీమ్స్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 51 మందిని అరెస్ట్ చేశారు.
జనాల మధ్య చిల్లర వేశాలు వేస్తున్న ఆకతాయిల ఆటపట్టించేందుకు షీటీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని గణేష్ మండపాల దగ్గర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని షీ టీమ్స్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 51 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని గణేష్ మండపాల దగ్గర పోకిరీలు మహిళలను వేధిస్తున్నారని… డయల్ 100 ద్వారా షీటీమ్స్‌కు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల్లో మండపాల దగ్గర 51 మందిని షీటీమ్స్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మఫ్టీలో తిరిగి పలువురు యువకులను పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లోని పలువురు మైనర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ఇచ్చారని.. ఏవరైనా మహిళలను వేధిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు..
