Vande Bharat: వందే భారత్ స్థాయికి సాధారణ కోచ్‌లు.! 40 వేల సాధారణ బోగీలను మార్పు

Updated on: Feb 04, 2024 | 8:48 AM

దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ 2024ను ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే ఒక చోదక శక్తిగా పేర్కొన్న మంత్రి.. రైల్వే శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ 2024ను ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే ఒక చోదక శక్తిగా పేర్కొన్న మంత్రి.. రైల్వే శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటిది ఇంధనం, ఖనిజాలు, సిమెంట్‌ కారిడార్‌ కాగా, రెండోది నౌకా అనుసంధాన కారిడార్‌, మూడోది ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్‌ గా పేర్కొన్నారు. వీటిని ప్రధాని గతిశక్తి పథకం కింద గుర్తించి వివిధ మార్గాల ద్వారా అనుసంధానించనున్నట్లు తెలిపారు. రవాణా సాంద్రత కారిడార్స్‌ ద్వారా ప్యాసింజర్‌ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరిచి వేగవంతమైన, సురక్షితమైన రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా వందే భారత్‌ వంటి సెమీ-హైస్పీడ్‌ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. విడతల వారీగా వీటి సర్వీసులను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కంటే వీటిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos