శ్రీలంక, ఇండొనేషియాలో మరణ మృదంగం వీడియో
శ్రీలంక, ఇండోనేషియాలో తుపాన్, వర్షాలు, వరదల్లో దాదాపు 350 మంది మరణించారు. శ్రీలంకలో దిత్వా తుపాన్ బీభత్సంలో మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 21 మంది గల్లంతయ్యారు. శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు కొట్టుకపోయాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ విపత్తు కేంద్రం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఇండోనేషియాలో వరదల కారణంగా 80 మంది మరణించగా, డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. ఉత్తర సుమత్రాలో వరద నష్టం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర సుమత్రా అంతటా 8,000 మంది ప్రజలను ఖాళీ చేయించారు. కొండచరియలు విరిగిపడి ఆ శిథిలాల కారణంగా రోడ్లు మూసుకుపోయాయి. హాంకాంగ్‌లోని అపార్ట్‌మెంట్లలో చెలరేగిన మంటలలో మృతుల సంఖ్య ఇప్పటికి 94కి చేరింది. పలువురు గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. మంటల్లో తప్పిపోయిన వందలాది మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా అగ్నిమాపక అధికారులు తెలిపారు. తమ వారి ఆచూకీ కోసం వందలాది మంది ప్రమాద స్థలం వద్ద నిరీక్షిస్తున్నారు. సజీవదహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉండటంతో మృతుల వివరాల నిర్ధారణ సవాల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
