Andhra: పట్టుబడ్డవి యూరియా బస్తాలు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు

Updated on: Aug 20, 2025 | 11:45 AM

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం బొడ్డురేవులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 320 కిలోల గంజాయిను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో 16 మంది అరెస్ట్ కాగా.. ఆటో, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా.. 

చట్టాలు ఎన్ని అమలు చేసినా.. కేటుగాళ్లు యదేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నారు. ఇదే యవ్వారం ఇటీవల ఏపీలో జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రాష్ట్ర సరిహద్దు దాటించాలని చూడగా.. పోలీసులు కాపుకాసి రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా.. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. వి.మాడుగుల మండలం బొడ్డురేవులో పోలీసుల తనిఖీల్లో 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటో, మూడు బైక్‌లలో గంజాయి తరలిస్తుండగా 16 మందిని అరెస్ట్‌ చేశారు. ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారని, పట్టుబడిన గంజాయి విలువ 16 లక్షలు ఉంటుందన్నారు పోలీసులు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి