అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??

|

Sep 14, 2024 | 1:07 PM

నాగరిత పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా? అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే... కన్నబిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి, మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఖరాఖండీగా చెప్పేసాడు ఓ ఇంటి ఓనరు. దాంతో పసివాడి మృతదేహాన్ని రోడ్డుపక్కన టెంట్‌ వేసి బంధువులు కడసారి చూసేందుకు ఏర్పాటు చేసారు

నాగరిత పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా? అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే… కన్నబిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి, మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఖరాఖండీగా చెప్పేసాడు ఓ ఇంటి ఓనరు. దాంతో పసివాడి మృతదేహాన్ని రోడ్డుపక్కన టెంట్‌ వేసి బంధువులు కడసారి చూసేందుకు ఏర్పాటు చేసారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన ఇబ్రహీం పట్నం మండలంలో సోమవారం జరిగింది. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి బంధువుల కడసారి చూపుకోసం ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్‌ మీడియా బ్యాన్‌.. ఎందుకో తెలుసా ??

ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..

దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..