మేమిద్దరం సేమ్ బెంచ్‌మేట్స్‌.. : ఉపరాష్ట్రపతి

Vice President Venkaiah Naidu condoles demise of Jaipal Reddy, మేమిద్దరం సేమ్ బెంచ్‌మేట్స్‌.. : ఉపరాష్ట్రపతి

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి భౌతికదేహానికి నివాళులు అర్పించిన వెంకయ్య.. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ప్రతి క్షణం ప్రజలకోసమే కష్టపడ్డారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో తమ ఇద్దరిదీ ప్రత్యేక పాత్ర ఉండేదని గుర్తు చేసుకున్నారు. రెండు పర్యాయాలు ఒకే బెంచ్‌లో కూర్చున్నామని.. ప్రజాస్వామ్య వ్యవస్థకు జైపాల్ అధికప్రాధాన్యమిచ్చేవారన్నారు. అపారమైన మేధస్సు, అందరినీ ఆకట్టుకునే విశ్లేషణ ఆయన సొంతమన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెంకయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *