‘వాల్మీకి’ శాంపిల్.. భయానకమా..? బీభత్సమా..?

Varun Tej's Valmiki Teaser Date Locked

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ విలన్ లుక్‌లో కనిపించనున్నాడు. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. 14రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట,గోపి చంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

కాగా ఈ మూవీ టీజర్‌ను ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *