ఉసేన్‌ బోల్ట్‌కి పాజిటివ్‌.. గతవారం గ్రాండ్ పార్టీ ఇచ్చిన స్ప్రింటర్

దిగ్గజ స్ప్రింటర్, ఎనిమిది ఒలింపిక్ బంగారు పతకాల వీరుడు ఉసేన్ బోల్డ్‌కి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో బోల్ట్‌కి పాజిటివ్ రావడంతో ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు

ఉసేన్‌ బోల్ట్‌కి పాజిటివ్‌.. గతవారం గ్రాండ్ పార్టీ ఇచ్చిన స్ప్రింటర్
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2020 | 10:34 AM

Usain Bolt Corona Positive: దిగ్గజ స్ప్రింటర్, ఎనిమిది ఒలింపిక్ బంగారు పతకాల వీరుడు ఉసేన్ బోల్డ్‌కి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో బోల్ట్‌కి పాజిటివ్ రావడంతో ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ”శనివారం జరిపిన పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నా. అందుకే నా స్నేహితులకు దూరంగా ఉంటూ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నా. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రొటోకాల్ ఏంటన్నది తెలుసుకుంటాను” అని అన్నారు. ఈ వీడియోకు నా ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా అని కామెంట్ పెట్టారు. ఇక బోల్డ్‌కి పాజిటివ్ వచ్చిన విషయాన్ని జమైకా ఆరోగ్య మంత్రి కూడా ధృవీకరించారు.

అయితే ఆగష్టు 21న బోల్డ్‌ తన 34వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో చాలా మంది పాల్గొనడంతో పాటు ఎవరూ మాస్క్‌లు పెట్టుకోలేదు. కోవిడ్ ఏ నిబంధనలను వీరు పాటించనట్లు సమాచారం. ఇక ఇప్పుడు బోల్డ్‌కి పాజిటివ్‌గా తేలడంతో.. ఆ పార్టీకి హాజరైన వారిలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. వారిలో చాలా మంది సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ పార్టీకి క్రికెట్ లెజండ్ క్రిస్ గేల్‌ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

Read More:

వివాదంలో చిరంజీవి ‘ఆచార్య’

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,579 కొత్త కేసులు.. 9 మరణాలు

వాహనం లోపల చెక్ చేయగా.. కళ్లు చెదిరేలా....
వాహనం లోపల చెక్ చేయగా.. కళ్లు చెదిరేలా....
ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం