అయోధ్యలో వేంకటేశ్వరస్వామి ఆలయం..

అయోధ్యలో రామమందిరమే కాదు.. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి ఆలయమూ కొలువదీరబోతోంది. అక్కడ శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు యూపీ ప్రభుత్వాన్ని ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

అయోధ్యలో వేంకటేశ్వరస్వామి ఆలయం..
Follow us

|

Updated on: Sep 16, 2020 | 6:00 PM

అయోధ్యలో రామమందిరమే కాదు.. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి ఆలయమూ కొలువదీరబోతోంది. అక్కడ శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు యూపీ ప్రభుత్వాన్ని ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. యూపీ సర్కార్‌ కూడా స్థల కేటాయింపుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ఉత్తరాది భక్తులు ఎప్పటి నుండో శ్రీవారి ఆలయ ప్రతిరూపాన్ని తమ ప్రాంతాల్లో నిర్మించాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు టీటీడీ కూడా ఉత్తరాదిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే జమ్మూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. డుమ్మీ, మజిన్ పరిసరాల్లో జమ్మూ ప్రభుత్వం స్థలాన్ని కూడా నిర్థారించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఇంజినీరింగ్ అధికారుల బృందం ఆ స్థలాన్ని పరిశీలించింది. ఇక భూ కేటాయింపు ప్రక్రియ పూర్తైతే త్వరలోనే జమ్మూలో శ్రీవారి ఆలయం కొలువుదీరబోతోంది.

ఇప్పటికే హైదరాబాద్, కురుక్షేత్ర, కన్యాకుమారీలలో శ్రీవారి ఆలయ నిర్మాణాలు పూర్తి చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. భువనేశ్వర్, వైజాగ్, చెన్నయ్ లలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయ్ లోని బాద్రా ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి 650 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ రూ.30కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది.

తాజాగా శ్రీరాముడి జన్మ స్థలమైన అయోధ్యలో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. 5 ఎకారాల స్థలాన్ని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. యూపీ ప్రభుత్వం కూడా స్థల కేటాయింపుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్యలో ఇప్పటికే రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. శ్రీవారి ఆలయం కూడా నిర్మిస్తే ఉత్తరాది భక్తులు అటు రామ భజన, ఇటు గోవిందనామ స్మరణతో పరవశించిపోతారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు