Humanity: కొంతమంది ఎంత చదువు ఉన్నా.. ఎన్ని అవకాశాలున్నా.. ఏదో తక్కువైదంటూ జీవితాన్ని గడిపేస్తారు.. మరికొందరు.. తమకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ.. పదుగురికి ఆదర్శం అనిపించేలా జీవిస్తారు. అలా కష్టపడేవారికి అండగా నిలబడడానికి… చాలామంది ముందుకొస్తారు.. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా జరిగిన ఓ సంఘటన.. ఆదిత్య శర్మ(Aditya Sharma) అనే ట్విట్టర్ (Twitter) యూజర్ ఓ పోస్ట్ చేస్తూ.. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ (Food Delivery) గురించి వివరిస్తూ.. బైక్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాని.. తనకు కలిసి రావాలంటూ నెటిజన్లను కోరారు. ఆహారాన్ని డెలివరీ చేయడానికి ఈ మండే ఎండల్లో సైకిల్ మీద వస్తున్న ఓ డెలివరీ మ్యాన్‌కి బైక్‌ను కొనుగోలు చేయడంలో సహాయం కోరుతూ ఆదిత్య శర్మ చేసిన ట్వీట్ కు అనూహ్య స్పందన లభించింది. వివరాల్లోకి వెళ్తే..
“ఈ రోజు నేను చేసిన ఫుడ్ ఆర్డర్ నాకు సమయానికి డెలివరీ చేయబడింది. అయితే ఈ ఘటన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈసారి డెలివరీ బాయ్ సైకిల్‌పై వచ్చాడు. రాజస్థాన్‌లోని ఈ మండే ఎండల్ల.. అందునా ఈరోజు తాను ఉన్న ప్లేస్ లో ఉష్ణోగ్రత దాదాపు 42 °C ఉంన్నా.. ఓ వ్యక్తి సైకిల్ మీద వచ్చి సమయంలోపు ఫుడ్ డెలివరీ చేశాడని తెలిపారు శర్మ. అయితే అప్పుడు నేను డెలివరీ వ్యక్తి గురించి కొంత తెలుసుకున్నాను..
because everything is turning towards online
he has taken loans and fulfilling loans from various banks. and tires to save money to purchase a bike
So I asked about that he requires a bike to which he said ; 4/
— Aditya Sharma (@Adityaaa_Sharma) April 11, 2022
ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి పేరు దుర్గా మీన. అతని వయస్సు 31 సంవత్సరాలు. అంతకు ముందు టీచర్ గా ఉద్యోగం చేసేవాడు. టీచర్ గా 12 ఏళ్ళు విధులను నిర్వహించాడు. అయితే కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంలో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణనిమిత్తం గత కొన్ని నెలల నుండి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాడు. నెలకు దాదాపు 10 వేలు పంపిణీ చేస్తున్నాడు. చక్కని ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నాడు. అని పోస్ట్ చేశారు శర్మ.
guys, I want to raise crowdfunding of 75k I know its a huge amount but if this reaches 75k people and each person gives 1 rs we can fulfill his wish of having a bike
even he said he will return all the money of downpayment SUCH AN HARDWORKING PERSON
DETAILS BELOW. 6/
— Aditya Sharma (@Adityaaa_Sharma) April 11, 2022
అంతేకాదు దుర్గా మీన చదువు వంటి వివరాలను కూడా ట్విట్ చేశాడు.. BCOMలో తన బ్యాచిలర్స్ చేసాడు. MCOM చేయాలనుకుంటున్నాడు. అయితే అతని ఆర్థిక పరిస్థితి కారణంగా.. ఇప్పుడు జొమాటో లో డెలివరీ బాయ్ గా పని చేయడం ప్రారంభించాడు. దుర్గాకు ఇంటర్నెట్ గురించి, చదువు గురించి అన్నీ తెలుసు. దుర్గా తనకు స్వంత ల్యాప్‌టాప్, మంచి వైఫై కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే.. అప్పుడు స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లో చదువు చెబుతూ.. తనను తాను ఆర్ధికంగా మరింత మెరుగు పరచుకోగలను అని భావిస్తున్నాడు అని శర్మ ట్విట్టర్ ద్వారా.. టీచర్ .. డెలివరీ బాయ్ గా మారిన కథను వివరించారు. అంతేకాదు.
All thanks to you guys ❤️?
Delivered the bike less than 24 hours
Still people are sending money requesting them not to send
Fundraising closed
He is very happy now ? pic.twitter.com/KhQp92OmtV— Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022
ఎవరైనా మీనాకు సహాయం చేయమని నెటిజన్లను కోరారు. క్రౌడ్ ఫండింగ్‌ను ప్రారంభించారు. శర్మ చేసిన ట్విట్ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.. డెలివరీ మ్యాన్‌కు సహాయం చేయడానికి నిధులు పోగయ్యాయి. ఎంతగా అంటే ట్వీట్ పోస్ట్ చేసిన 24 గంటలలోపే, శర్మ మీనాకు బైక్‌ను బహుమతిగా ఇవ్వగలిగారు. అప్‌డేట్‌ను పంచుకోవడానికి అతను ఫోటోతో పాటు ఒక ట్వీట్‌ను కూడా పంచుకున్నారు. అవును సమాజంలో ఎంతమంది స్వార్ధ పరులున్నా.. ఇతరుల కష్టాలలో ఆడుకుంటూ సాయం చేసే కొంతమంది తప్పనిసరిగా ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: K A Paul: గవర్నర్ తమిళిసై ని కలిసిన కేఏ పాల్.. తెలంగాణ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..