Viral Video: ట్రాక్ పక్కన చేతులు కడుగుతున్న యువకుడిని ఢీ కొట్టిన ట్రైన్.. అక్కడికక్కడే మృతి

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కొందరు కూర్చొని ఉండడం, ట్రాక్‌ దగ్గరగా నిలబడి చేతులు కడుక్కుంటున్న యువకుడు కనిపించడం వీడియోలో ఉంది. ఇంతలో మరో యువకుడు అక్కడికి చేరుకుని అతని వద్ద నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తాను కూడా చేతులు కడుక్కోవడం మొదలుపెట్టాడు.

Viral Video:  ట్రాక్ పక్కన చేతులు కడుగుతున్న యువకుడిని ఢీ కొట్టిన ట్రైన్.. అక్కడికక్కడే మృతి
Train Video Viral

Updated on: Jul 02, 2023 | 1:49 PM

ఎవరైనా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్ అంచుకు వెళ్లకపోవడమే మంచిది.. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చు. ప్లాట్‌ఫారమ్‌కి దగ్గరగా ఉండే ట్రాక్‌ పై ప్రయాణించే రైలు ఢీకొనే అవకాశం ఉంది. అవును, అది జరగవచ్చు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలకు గూస్‌బంప్స్ ఇచ్చింది. ఓ యువకుడు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కొందరు కూర్చొని ఉండడం, ట్రాక్‌ దగ్గరగా నిలబడి చేతులు కడుక్కుంటున్న యువకుడు కనిపించడం వీడియోలో ఉంది. ఇంతలో మరో యువకుడు అక్కడికి చేరుకుని అతని వద్ద నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తాను కూడా చేతులు కడుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న హైస్పీడ్ రైలు ఆ యువకుడిని బలంగా ఢీకొట్టింది. వెంటనే దూరంగా వెళ్లి పడిపోయాడు. మళ్లీ లేవలేదు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఈ హృదయ విదారక సంఘటన జరిగిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో మురగుండ్లవెంకీ అనే ఐడితో షేర్ చేశారు.  రైల్వే ప్లాట్‌ఫారమ్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ట్రాక్‌ పక్కనే నిల్చొని ప్రమాదాల బారిన పడి మరణించడం కొత్త విషయం కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు లేదా దిగుతున్నప్పుడు కూడా తరచుగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రైల్వే అధికారులు ప్రయాణిలకు అనేక సూచనలు చేస్తూ ఉంటారు.  అయితే కొందరు ఆ విషయాలను పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..