Heart Attack: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. హఠాత్తుగా కుప్పకూలి మృతి.. ఏం జరిగిదంటే..

మే 21 బుధవారం మధ్యాహ్నం అతను భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి.. మళ్ళీ షాపుకి బయల్దేరాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు గుండెపోటు కారణంగా అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Heart Attack: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. హఠాత్తుగా కుప్పకూలి మృతి.. ఏం జరిగిదంటే..
Young Man Fell On The Road

Updated on: May 22, 2025 | 5:30 PM

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు డెంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. హార్ట్‌ఎటాక్‌ కారణంగా హఠాత్తుగా సంభవిస్తున్న మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా,పెద్దా, ఆడ, మగ, పేద, ధనిక అనే తేడాలు లేకుండా హార్ట్‌ఎటాక్‌ ఎటాక్‌ చేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు నుంచి 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉన్నవారు కూడా సడెన్‌గా కుప్పకూలి మరణించిన ఘటనలు అనేకం చూశాం. అలాంటి ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేధికగా ప్రస్తుతం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది.

యూపీలోని మొరాదాబాద్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. భోజ్‌పూర్‌లోని కాబూలి చౌక్ సమీపంలో రెహాన్ ఖురేషి అనే 25ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా నడిరోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోయాడు. నగరంలోని మొహల్లా జామా మసీదు నివాసి అయిన మహ్మద్ రిహాన్ నగరంలోని ఒక మొబైల్ కంపెనీలో పనిచేసేవాడు. మే 21 బుధవారం మధ్యాహ్నం అతను భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి.. మళ్ళీ షాపుకి బయల్దేరాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు గుండెపోటు కారణంగా అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మొహల్లా కాబూలి చౌక్ వద్దకు రాగానే రిహాన్‌ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. ఆ వెంటనే అతను స్పృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రిహాన్ మరణ వార్త విన్న తర్వాత కుటుంబ సభ్యులలో కలకలం చెలరేగింది. భార్య ఫౌజియా ఖురేషి, తల్లి రౌఫీ, తండ్రి గుఫ్రాన్ ఖురేషి, తోబుట్టువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గత ఆరు నెలల క్రితమే రిహాన్‌కు వివాహమైనట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..