ఇతడిని పిచ్చోడు అనాలా.. వెర్రోడు అనాలా..?.. లవర్స్ మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి. 2 రోజులు అలగడం.. ఆపై నార్మల్ అవ్వడం కామన్. కానీ ఓ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఆవేశపడ్డాడు. లవర్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఏకంగా మర్మాంగాన్ని బ్లేడ్‌త్ కట్ చేసుకున్నాడు. ఓ విషయంలో వీరి మధ్య.. గొడవ జరిగింది. దీంతో తనను తానే హర్ట్ చేసుకుని.. ఇప్పుడు కనీసం కదలేని స్థితికి చేరాడు. ప్రజంట్ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఈ ఇన్సిడెంట్ గుజరాత్‌లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని కుచ్‌బెహర్ ఏరియాకు చెందిన ప్రసన్నజీత్ బర్మన్ ప్రజంట్ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన మామయ్య శపన్ బర్మన్తో కలిసి ఉంటున్నాడు. అక్కడే ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం ప్రసన్నజీత్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆపై వారి ఫ్రెండ్షిప్ ప్రేమ వరకు వెళ్లింది. దీంతో ప్రసన్నజీత్ లవర్‌తో తరచుగా వీడియో కాల్స్ మాట్లాడేవాడు. కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్ తన ప్రియురాలితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల వాగ్వాదం జరిగింది. దీంతో ప్రసన్నజీత్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడు అయ్యాడు. వీడియోకాల్‌లో తన ప్రియురాలు చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్‌తో తన మర్మాంగంపై దాడి చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఇంటికి చేరుకున్న శపన్ బర్మన్ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడ్ని చూసి షాకై.. వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. విషయం తెలుసుకున్న డాక్టర్లు వెంటనే ప్రసన్నజీత్‌కు చికిత్స అందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..