
చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నాడు. వయసు 50 ఏళ్ల వరకు ఉంటుంది. వచ్చింది పవిత్ర దేవాలయానికి. కానీ అతడి పాడుబుద్ధి చూస్తే మీరే తిట్టిపోస్తారు. కనీసం సభ్యత, సంస్కారం లేకుండా బిహేవ్ చేశాడు ఆ వ్యక్తి. గుడికి వచ్చిన ఓ యువతిని అసభ్యకరంగా ఫోటోలు తీశాడు. ఆపై ఆమెపై తదేకంగా చూడటం ప్రారంభించాడు. అతని ప్రవర్తన కాసేపు ఓపికగా భరించిన ఆ యువతి.. ఇక సహనం నశించి నేరుగా అతని వద్దకు వెళ్లి ప్రశ్నించింది. ఫోన్ ఓపెన్ చేయించి గ్యాలరీలో ఉన్న తన కాళ్ల ఫోటోలను చూపించి.. ఎందుకు ఫోటోలు తీశారని ప్రశ్నించింది. అందరు ముందు ఆ యువతి కాళి దేవీలా మారి ప్రశ్నించడంతో.. ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. ఆ యువతి ఫోటోలను తన ఫోన్ నుంచి డిలీట్ చేశాడు. అయితే ఆ యువతి ప్రశ్నిస్తుండగా చుట్టూ ఉన్న ఎవరూ ఆమెకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. ఆ యువతికి తండ్రి వయసులో ఉండి.. అతను చేసిన పనిపై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. చివరికి దేవాలయాల్లో కూడా మహిళలకు రక్షణ కరువైందని కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమాజంలో విచ్చలవిడి చేష్టలు పెరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు. మౌంట్ అబూలోని డెల్వాడ జైన ఆలయం వెలుపల ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అతనిపై కేసు నమోదు అయ్యిందా.. లేదా లాంటి వివరాలు తెలియరాలేదు. ఈ తరహా ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. మిగిలినవారికి భయం ఉంటుందని… మహిళా సంఘాలు వారు చెబుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..