Viral: ఇంటి పైకప్పుకు చేరిన పాము.. ఆ తర్వాత ఇది సీన్..

చాలా రకాల పాముల్ని మీరు చూసి ఉంటారు. మన దగ్గర తాచుపాము, జెర్రిపోతు, కట్ల పాము, రక్త పింజర వంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి కాకుండా ఇంకా వందల కొద్ది జాతులు మనుగడలో ఉన్నాయి. వాటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోడానికి చాలామంది ఇంట్రస్ చూపిస్తారు.

Viral: ఇంటి పైకప్పుకు చేరిన పాము.. ఆ తర్వాత ఇది సీన్..
Python

Updated on: Apr 10, 2024 | 1:15 PM

పాముల గురించి నిత్యం వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. తాజాగా ఓ కొండచిలువ మల విసర్జన చేస్తున్న ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్  తమ ఫేస్‌బుక్ పేజీలో నమ్మశక్యం కాని ఈ చిత్రాన్ని షేర్ చేశారు.  , “ఏం లోపలికి వెళ్లినా, తప్పక బయటకు వస్తుంది” అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. చిత్రంలో ఒక పెద్ద కొండచిలువ ఇంటి పైకప్పుపై నుండి మల విసర్జన చేస్తుంది. దాని వ్యర్థాల పరిమాణం చూసి ఆశ్చర్యపోయారు. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ, ఇది ప్రజలకు చాలా షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ భారీ సైజ్ పాములు ఆ పరిమాణంలోనూ మల విసర్జన చేస్తాయి అని చెప్పుకొచ్చారు.

కొండచిలువలు సాధారణంగా పెద్ద పరిమాణంలో ఆహారం తీసుకుంటాయి.. ఆ ఫుడ్ జీర్ణించుకోడానికి కూడా చాలా సమయం పడుతుంది.  కాబట్టి ఈ కొండచిలువ.. దాదాపు వారం రోజుల తర్వాత మలవిసర్జన చేసి ఉంటుందనడంలో సందేహం లేదని చెప్పారు. మొత్తం బకెట్ నింపేంత.. మల విసర్జన చేసే పెద్ద పాములను తాను చూసినట్లు సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రానికి ఫేస్‌బుక్‌లో 1,600కి పైగా ‘లైక్‌లు’, వందల కొద్దీ షేర్లు, కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఈ చిత్రాన్ని చూసి అసహ్యించుకుంటే, మరికొందరు పాము ఇంత ఎక్కువ మలవిసర్జన చేయగలదా అని ఆశ్చర్యపోయారు. (Source)