
Viral Videos 2021: ఆధునిక కాలంలో టెక్నాలజీ పరంగా ఎంతగానో అభివృద్ది చెందాం. సోషల్ మీడియా విస్తృతి కూడా బాగా పెరిగింది. దాంతో ప్రపంచం చాలా చిన్నదిగా అయిపోయింది. ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ప్రపంచం నలుమూలల్లో ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం చేరిపోతుంది. ఈ క్రమంలో రకరకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, చిన్నపిల్లలు, జంతువులకు సంబంధించిన వీడియోలు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2021 సవత్సరంలో నెట్టింట ఓ రేంజ్లో హల్ చల్ చేసిన, చేస్తున్న టాప్ 9 వైరల్ వీడియోలను మరోసారి చూద్దాం..
1. అడవికి రాజు సింహం. దాని ముందు ఏ జంతువు నిలబడలేదు. అయితే ఎంతటి బలవంతుడైనా ఒక్కోసారి విధికి తలవంచక తప్పదు. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ సింహానికి ఎదురైంది. సడెన్ గా ఓ మృగరాజును.. 20 హైనాలు చుట్టుముట్టేసి దాడి చేయడం ప్రారంభించాయి. అలాంటి పరిస్థితిలో ఆ సింహం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వాటితో తీవ్రంగా పోరాడుతోంది. ఇదంతా దూరం నుంచి గమనించిన మరో సింహం.. ఆ సింహానికి సాయం చేయడానికి హైనాల మందపైకి దూసుకొచ్చింది. హైనాలతో పోరాడుతున్న బాధిత సింహం తన నేస్తం రావడాన్ని చూసి మరింత బలంగా పోరాడింది. దీంతో ఆ సింహాన్ని ఏం చేయలేక హైనాల గుంపు మైదానాన్ని విడిచి పారిపోయింది. ఈ వైరల్ వీడియో కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆపదలో ఉన్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు ప్రతి ఒక్కరికీ అవసరమని ఈ వీడియో ద్వారా తెలిసింది. సింహం తన తోటి సింహాన్ని కాపాడింది.. జంతువులకు కూడా మనుషులలాగే భావోద్వేగాలు ఉంటాయని ఈ వీడియో రుజువు చేస్తోంది అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
2. ఈ ఏడాది నెట్టింట్లో బాగా వైరల్ అయిన మరో వీడియో ఏంటంటే.. సాధారణంగా మన దృష్టిలో సింహం, పులి వంటివి మాత్రమే బలమైన జంతువులు, వాటితో పెట్టుకుంటే ప్రమాదం అనుకుంటాం.. కానీ.. అంతకన్న పవర్ ఫుల్ జంతువు అడవి పంది అన్న విషయం మీకు తెలుసా? ఓ ఇంటి సీసీకెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అడవి పంది తనకు ఎంత బలం ఉంటుందో అందులో చూపించింది. ఈ వీడియో చూసినోళ్లంతా షాక్ అవుతున్నారు. ఓ భవనానికి ఇనుప గేట్లు ఉన్నాయి. ఇంటి బయట రోడ్డు ఉండగా… ఆ రోడ్డుకు అటువైపున అడవి ఉన్నట్లు కనిపిస్తోంది. అటు నుంచి వచ్చిన ఆ అడవి పంది… రోడ్డుపై ఓ లారీ వస్తుండటం చూసి… ప్రాణభయంతో… ఇంటివైపు పరుగులు పెట్టింది. కానీ ఇంటి గేట్లు మూసి ఉండటంతో… వాటిలో ఓ గేటును తన తలతో ఢీకొట్టింది. అంతే ఆ గేటు ఒక్కసారిగా ముక్కలై ఊడి కింద పడిపోయింది. తనపై పడిన గేటును ఎలాగోలా తొలగించుకున్న ఆ అడవి పంది.. అక్కడినుంచి పరుగులంకించుకుంది. అలా ఓ గేటును అది పగలగొట్టేయడాన్ని బట్టీ దానికి ఎంత శక్తి ఉందో అర్థమవుతోంది. ఈ వీడియో కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది.
3. ఇకపోతే.. ప్రపంచంలో తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టంగా ఉంటుంది. అలాంటి ఓ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. హార్బర్ బౌలేవార్డ్ రోడ్డులో ఉన్న కార్ స్టీరియో స్టోర్, అటో షాప్ గోడల మధ్య ఓ మహిళ చిక్కుకుంది. ఎప్పటిలానే తమ పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు.. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గోడ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కార్ స్టీరియో షాప్ టెర్రాస్‌పై నుంచి చూడగా.. ఆ మధ్య స్థలంలో ఓ మహిళ నగ్నంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. వెంటనే రెస్క్యూ టీమ్‌ని పిలిపించి, సుమారు రెండున్నర గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆ మహిళను సురక్షితంగా గోడ నుంచి బయటికి తీశారు. అసలు ఆమె ఎందుకు గోడలో చిక్కుకుందో.? నగ్నంగా ఉండడానికి రీజన్ ఏంటి.? అనేవి మిస్టరీగానే ఉన్నాయి.
4. సాధారణంగానే ఉయ్యాల అంటే చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ ఉయ్యాల సరదా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తెచ్చింది. రష్యాలోని డగేస్టన్‌లో అనే టూరిస్ట్‌స్పాట్ లో టూరిస్టులకు సరికొత్త అనుభూతి కోసం కొండ అంచున ఉయ్యాల ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన కొందరిలో ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ఆసక్తి చూపారు. కొండ అంచున ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించి.. ఉయ్యాల ఎక్కారు. మరో వ్యక్తి ఆ ఉయ్యాలను బలంగా ఊపాడు. అలా మూడు సార్లు బలంగా ఊపాడు. నాలుగోసారి ఊపే సమయంలో ఆ యువతులు.. కిందకు దిగేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఉయ్యాల అదుపు తప్పి అమాంతం 6,300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
5. జార్ఖండ్‌లోని ఓ రహదారిపై వింత ఆకారం కనబడటంతో ప్రజల్లో అలజడి చెలరేగింది. దాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. చిమ్మ చీకట్లో తెల్లని ఆకారం ఒకటి.. నదిపై కొత్తగా నిర్మించిన వంతెన మీద నడుస్తూ వెళ్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అయింది. జార్ఖండ్ రాష్ట్రం హజారిబాగ్ జిల్లాలో ఈ దృశ్యం కనిపించింది. కట్కమ్సండి-చత్రా రహదారిపై..రాత్రి వేళ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తోన్న వాహనదారులు ఈ వింత ఆకారాన్ని చూసి హడలెత్తిపోయారు. వారిలో ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రజలు అది దెయ్యమా ..? లేక గ్రహాంతరవాసి ఇలా వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చీకట్లో కనిపించిన ఆ వింత ఆకారం చూసి భయంతో జనం వణికిపోయారు. అది దెయ్యమే అంటూ కొందరు.. కాదు కాదు.. ఏలియన్ అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తర్వాత తేలిందేమిటంటే అది ఫ్రాంక్ అని! ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్లో తెగ వైరల్‌గా మారింది.
6. ఇటీవల ఏనుగులు.. గున్న ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ గున్న ఏనుగు చేసిన పనికి తల్లి ఏనుగు ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఈ వీడియోలో ఓ పిల్ల ఏనుగు పార్క్‌లో గాఢంగా నిద్రపోయింది. ఇంతలో అక్కడకు వచ్చిన తల్లి ఏనుగు దానిని నిద్రలేపడానికి ప్రయత్నించింది. అయితే మంచి నిద్రలో ఉన్న ఆ పిల్ల ఏనుగు.. అసలు కదలలేదు. దీంతో తల్లి ఏనుగు ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పార్క్ నిర్వాహకుల తీసుకువచ్చింది. అయితే వారు వచ్చి.. ఆ పిల్ల ఏనుగును కదపగా.. వెంటనే పిల్ల ఏనుగు ఉలిక్కిపడి లేచింది. దీంతో తల్లి ఏనుగు ఊపిరి పీల్చుకుంది. పిల్ల ఏనుగు కోసం ఆ తల్లి ఏనుగు పడే తాపత్రాయం కాస్త ఎమోషనల్‌గా అనిపించిన.. ఆ గున్న ఏనుగు చేసిన పని చూస్తే మాత్రం నవ్వు రాకమానదు. ఈ వీడియోను ఇప్పటికీ నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇలాంటివి ఎన్నో వైరల్ వీడియోలు 2021 సంవత్సరంలో నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
7. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సహదేవ్ డిర్డో అనే పిల్లవాడి వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ వైరల్ వీడియోలో బాలీవుడ్ పాట ‘‘బచ్పన్ కా ప్యార్’’ అంటూ బుడ్డోడు పాడిన పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. చిన్నారిని ఓవర్ నైట్ స్టార్‌ని చేసేసింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆ బాలుడిని సత్కరించారు.
8. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రులపాలై చికిత్స తీసుకుని కొందరు కోలుకోగా… ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోవిడ్ 19 ఎమర్జెన్సీ వార్డులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ బారిన పడ్డ యువతికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో యువతి.. షారుఖ్ ఖాన్, అలియా భట్ నటించిన బాలీవుడ్ సినిమా డియర్ జిందగీలోని ‘‘లవ్ యు జిందగీ’’ పాట పాడుతూ జాలీగా ఉంటుంది. అయితే, చివరకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆ యువతికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అయ్యింది.
9. కోవిడ్ సంక్షోభం సమయంలో అందరి హృదయాన్ని కలిగించే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు కొందరు వైద్యులు పీపీఈ కిట్లను ధరించి బాలీవుడ్ పాట ‘సోచ్నా క్యా’ పాటకు నృత్యం చేస్తారు. అది నెట్టింట్లో సంచలనం సృష్టించింది.
Also read:
Nora Fatehi: బాహుబలి బ్యూటీకి కరోనా పాజిటివ్.. పరిస్థితి బాలేదంటూ షాకింగ్ ట్వీట్ చేసిన హీరోయిన్..