
మనకు మార్కెట్‌లో బీర్, రమ్, వోడ్కా, విస్కీ వంటి అనేక రకాల ఆల్కహాల్స్ దొరుకుతాయి. వాటిని బ్రాండ్, క్వాలిటీ టేస్ట్‌ను బట్టి వాటి ధరలు ఉంటాయి. కొన్నింటి ధర వందల్లో ఉంటే, మరికొన్నింటి ధరల వేలల్లో ఉంటుంది. కానీ ఇక్కడో బాటిల్ ధర ఏకంగా కోట్లలో ఉంది. అవును మీరు వింటున్నది నిజమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యమైనా ఇసాబెల్లా ఇస్లే విస్కీ 750 ml ఉండే బాటిల్ ధర ఏకంగా 6 మిలియన్ డాలర్లట. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 52 కోట్లు.
ఈ మద్యం ఒక ml లో సుమారు 20 చుక్కలు ఉన్నాయి. అంటే మొత్తం 750 ml లో సుమారు 15,000 చుక్కలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో చుక్క ఖరీదు చూస్తే.. ఏకంగా రూ.33,333 పలుకుతోంది. ఇది ఎందుకు ఇంత ఖరీదైనదంటే..ఈ విస్కీని అందించే బాటిల్ చాలా ప్రత్యేకమైనది. అలాగే ఈ విస్కీ కూడా చాలా పురాతనమైనది అందుకే ఇసాబెల్లా ఇస్లే విస్కీ బాటిల్ ధర రూ.52 కోట్లు.
ఈ విస్కీ బాటిల్ ప్రత్యేకత ఏంటంటే ..ఈ బాటిల్ మొత్తం వజ్రాలు, కెంపులతో డిజైన్ చేసి ఉంటుంది. దానిపై దాదాపు 8500 కంటే ఎక్కువ వజ్రాలు, 300 కెంపులు ఉన్నాయి. అలాగే దానిపై బంగారం కూడా ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ బాటిల్‌లోని వజ్రాలను కొనుగోలుదారుడి ఇష్టానుసారం మార్చవచ్చు. ఈ విస్కీ బాటిల్‌ను చాలా ఖరీదైన చెక్క పెట్టెలో ఉంచారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.