Tea Party on Everest: మనం టీ తాగాలంటే ఏదైనా దగ్గర్లోని హోటల్‌కు వెళ్తాం.. పలానా చోట మంచి చాయ్ దొరుకుతుంది అంటే ఓ రెండు, మూడు కిలోమీటర్లయినా వెళ్లి తాగొస్తాం. కానీ వీళ్లు వెరీవెరీ స్పెషల్. ఎందుకంటే ఏకంగా ఎవరెస్ట్‌పైనే టీ పార్టీ పెట్టుకున్నారు. దాంతో గిన్నిస్ రికార్డ్‌లో చోటుసంపాదించారు. వారు ఎవరో కాదు..అథ్లెట్, పర్వతారోహకుడు అయిన ఆండ్రూ హ్యూస్.. తన సహచరులతో కలిసి ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించారు.
వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రూ హ్యూస్, తన సహచరులతో కలిసి మే 5, 2021న ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. క్యాంప్-2లో సముద్ర మట్టానికి 21,312 అడుగుల ఎత్తున టీ పార్టీ చేసుకున్నారు. కప్పుల్లో.. చిక్కటి, కమ్మటి.. వేడి వేడి టీ పోసుకొని.. సిప్ చేస్తూ.. కురుస్తున్న మంచును బాగా ఎంజాయ్ చేశారు. గతేడాది నిర్వహించిన ఈ పార్టీని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టీ పార్టీగా గిన్నిస్ బుక్ గుర్తించింది. వార్తపాతదే కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్ వుతూనే ఉంది. అలాంటి చోట టీ తాగడం భలే అనుభూతి కదా బాస్ అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.