Wooden Chair: రూ.500లకు చెక్క కుర్చీని కొని.. ఏకంగా 16 లక్షలకు అమ్మేసింది.. సీక్రేట్ అదే!

|

Feb 01, 2022 | 10:19 AM

వర్ నైట్ బిలియనీర్.. కనీసం మిలియనీర్ అయినా అవ్వాలని ఇలలో కుదరకపోతే.. కలలైనా కని సంతృప్తిపడని వారు ఉండరేమే ఈ జిందగీలో..! ఐతే లక్కు అందరినీ వెతుక్కుంటూ రాదు. ఏ కొద్దిమందినో వరిస్తుంది. అట్లాంటి ఓ మైండ్ బ్లోయింగ్ సంఘటన తాజాగా..

Wooden Chair: రూ.500లకు చెక్క కుర్చీని కొని.. ఏకంగా 16 లక్షలకు అమ్మేసింది.. సీక్రేట్ అదే!
Wooden Chair
Follow us on

Woman suddenly earn lakhs of rupees, Know how: ఓవర్ నైట్ బిలియనీర్.. కనీసం మిలియనీర్ అయినా అవ్వాలని ఇలలో కుదరకపోతే.. కలలైనా కని సంతృప్తిపడని వారు ఉండరేమే ఈ జిందగీలో..! ఐతే లక్కు అందరినీ వెతుక్కుంటూ రాదు. ఏ కొద్దిమందినో వరిస్తుంది. అట్లాంటి ఓ మైండ్ బ్లోయింగ్ సంఘటన తాజాగా బ్రిటన్‌ (Britain)లో చోటు చేసుకుంది. ఓ మహిళ రూ.500లకు ఒక చెక్క కుర్చీ (Wooden Chair:)ని కొనింది. తర్వాత అదే కుర్చీని ఏకంగా రూ.16 లక్షల రూపాయలకు అమ్మేసింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమండీ! అసలేంజరిగిందంటే..

నిజానికి సదరు చెక్క కుర్చీని అమ్మకానికి పెట్టినప్పుడు వస్తువుల ధరను నిర్ణయించే వ్యక్తి ఈ కుర్చీ మామూలు కుర్చీ కాదని, ఆస్ట్రియాలోని వియన్నా స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌కు చెందిందని, దీనిని 1902లో కొలోమన్ మోజర్ (మోజర్ వియన్నా కళాకారుడు. వేర్పాటు ఉద్యమం, సంప్రదాయ కళాత్మక శైలులను తిరస్కరించిన వ్యక్తి అతను) అనే ఆస్ట్రియన్ చిత్రకారుడు తయారు చేశాడని మహిళతో చెప్పాడు. చారిత్రక వస్తువుగా గుర్తించిన తర్వాత సదరు మహిళ ఆ చెక్క కుర్చీని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ చారిత్రాత్మక కుర్చీని స్టాన్‌స్టెడ్ మౌంట్ ఫిట్చెట్ కు చెందిన స్వోర్డ్స్‌లో వేలానికి పెట్టింది. ఈ వేలంలో ఆస్ట్రియాకు చెందని ఓ డీలర్ కొనుగోలు చేశాడు. అంతేకాకుండా ఈ వేలంతో యాధృచ్చికంగా ఆ కుర్చీ తిరిగి ఆస్ట్రియాకు వెళ్లడం జరిగింది.

Also Read:

Distance Education MA English 2022: ఆన్‌లైన్‌లో ఏంఏ ఇంగ్లీష్‌ను ప్రారంభించిన ఇగ్నో!