ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా కు పేరుంది. అలాంటి అత్యున్నత శిఖరాన్ని చూడడమే తప్ప దానిపై ఎక్కే అసాధారణ సాహసం దాదాపు ఎవరూ చేయరు. అయితే దుబాయికి చెందిన నికోల్ స్మిత్-లుడ్విక్ అనే మహిళ గతేడాది ఆగస్టులో ఈ భవంతిపై నిలబడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది . అప్పట్లో తన ఎయిర్ లైన్స్ ప్రమోషన్ కోసం బుర్జ్ ఖలీఫాను ఎక్కిన ఆ మహిళ మళ్లీ అదే ఎత్తైన భవంతిపై ప్రత్యక్షమైంది. ఈసారి తన వెంట ఓ భారీ విమానాన్ని కూడా తీసుకొచ్చింది. భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి దుబాయ్ ఎక్స్ పో ని ప్రమోట్ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూపొందించిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాజాగా షూట్ చేసిన యాడ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన కోసం నికోల్ స్మిత్-లుడ్విక్ ఎయిర్ హోస్టెస్ కాస్ట్యూమ్‌లో ముస్తాబై బుర్జ్ ఖలీఫా భవంతిని ఎక్కేసింది. గతేడాది ఆగస్టులో ఎమిరేట్స్ ప్రమోషనం ఈ అసాధారణ సాహసానికి పూనుకున్న ఆమె ఇప్పుడు దుబాయ్ ఎక్స్ పో ప్రమోషన్ కోసం మరోసారి ఆ అసాధారణ ఫీట్ ను అందుకుంది. భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనం శిఖరాగ్రంపై నిలబడి, ప్లకార్డులు చూపుతూ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పింద డేరింగ్ గర్ల్.. చెప్పదల్చుకున్న విషయాన్ని ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ‘నేనింకా ఇక్కడే ఉన్నాను. వావ్.. నాకు దుబాయ్ ఎక్స్ పో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిగొప్ప వస్త్ర ప్రదర్శనను చూసేందుకు ఎమిరేట్స్ విమానం ఎక్కి వచ్చేయండి ఫ్రెండ్స్.. ’అని రాసున్న ప్లకార్డులను వరుసగా ప్రదర్శించింది నికోల్. కాగా ఎయిర్ లైన్స్ ఉద్యోగి అయిన ఆమె ప్రొఫెషనల్ స్కైడైవింగ్ లో పూర్తి స్థాయి శిక్షణ పొందింది. అందుకే ఇలాంటి అసాధారణ సాహసాలే చేస్తోంది.
Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..
జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి…(వీడియో)