
Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఆ వీడియోలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నవ్వుతారు అదే సమయంలో బాధపడుతారు కూడా. ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్లినప్పుడు చాలామంది సందర్శకులు ఏం చేస్తారు.. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తారు. చుట్టు ఉన్న ప్రదేశాలను మరిచిపోతారు. దీంతో ఒక్కోసారి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఓ మహిళకు సరిగ్గా ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం.
ఒక మహిళ ఈఫిల్ టవర్ సందర్శించి నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి కింది ప్రదేశానికి వెళ్లడానికి జారుడు లాంటి ప్రదేశం నుంచి నడవాలి. అది గమనించని మహిళ మామూలుగా నడుస్తూ పట్టు కోల్పోవడంతో అకస్మాత్తుగా నేలపై పడిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. అయితే ఫొటోలు, సెల్ఫీల కోసం అతిగా ఆవేశపడితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికైనా వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ దృశ్యం నిజంగా ఫన్నీగా ఉందని ఒక నెటిజన్ అన్నాడు. మరొకరు ఆ మహిళకు గాయాలేమైనా అయ్యాయా అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ వీడియోను యంగ్‌ల్యాండ్‌లార్డ్ 01 అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో రెండు లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది.