Viral Video: బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుండగా.. హనుమాన్ చాలీసా పఠించిన యువతి.. వీడియో

Woman Brain Surgery - Hanuman Chalisa: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) లో అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైద్యులు 24 ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్

Viral Video: బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుండగా.. హనుమాన్ చాలీసా పఠించిన యువతి.. వీడియో
Woman Brain Surgery

Updated on: Jul 24, 2021 | 9:43 PM

Woman Brain Surgery – Hanuman Chalisa: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) లో అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైద్యులు 24 ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో.. ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన గురువారం జరిగిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న 24 ఏళ్ల యుక్తి అగర్వాల్‌ అనే మహిళకు బ్రెయిన్‌ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్‌ చాలీసా పఠించినట్లు ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీప‌క్ గుప్తా తెలిపారు. మూడున్నర గంట‌ల పాటు ఈ కీల‌క ఆపరేషన్ నిర్వహించి బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను తొల‌గించామని.. అప్పటివరకూ ఆమె స్పృహలోనే ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో యువతి హనుమాన్‌ చాలీసాలోని 40 శ్లోకాలను పఠించిందని పేర్కొన్నారు.

ఆమెకు ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో.. అనెస్థీషియా ఇవ్వడంతో పాటు నొప్పి నివారణ ఔషధాలు కూడా వాడామని వెల్లడించారు. కాగా.. మెదడు ఆపరేషన్ల సమయంలో రోగులు మెలకువతో ఉండాల్సిన అవసరాన్ని కూడా దీపక్‌ గుప్తా వివరించారు. రోగులు మెలకువతో ఉండడం వల్ల వారి మెదడులోని ఏ కీలక భాగం కూడా దెబ్బతినే ప్రమాదం ఉండదని వివరించారు. ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషమని దీపక్ గుప్తా వెల్లడించారు.

వైరల్ వీడియో..

హనుమాన్ చాలీసా పఠిస్తూ.. మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించడం ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు. కాగా.. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్‌‌లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా సోషల్‌ మీడియా అంతటా వైరల్‌గా మారింది.

Also Read: