తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి రక్షించారు. తానే స్వయంగా భుజాలపై అతడిని మోశారు. బాధితుడిని మోసుకెళ్లి ఆటోలోకి ఎక్కించి, ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామాన్య వ్యక్తి నుంచి ప్రాముఖుల వరకు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ రాజేశ్వరి అంటూ అభినందిస్తున్నారు. ఆమె స్పందించిన తీరు గొప్పదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
#WATCH | TP Chatram police inspector Rajeshwari carried an unconscious man on her shoulders and rushed him to a hospital in an autorickshaw. “We have to save his life at any cost,” she said. | #ChennaiRains
Report by @imjournalistRK https://t.co/ekcamZFgGg pic.twitter.com/doJTCbt0DS— News9 (@News9Tweets) November 11, 2021
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో 28 ఏళ్ల వ్యక్తి స్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది. అంబులెన్స్ రావడానికి దారి సరిగా లేకపోవటంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి బాధితుడిని భుజాలపై మోసుకెళ్లారు. ఎగ్మోర్, పెరంబూర్ వంటి ప్రాంతాల్లో చెట్లు నేలకూలినట్లు పోలీసులు తెలిపారు. వర్షం, వరదల వల్ల శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించారని తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని, చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Read Also.. Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. నెట్టింట మిలియన్న కొద్దీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతున్న వీడియో