Viral Video: ఓ మహిళ పిక్-కలర్ సరస్సు మధ్యలో కూర్చుని సంగీత వాయిద్యాన్ని ప్లే చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఒక నిమిషం నిడివిగల వీడియోలో ఇంటర్ నెట్ వేదికగా దుమ్మురేపుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో..23 ఏళ్ల కజకిస్థాన్ యువతి గులాబీ రంగు నీళ్లున్న సరస్సులో కూర్చొని సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కజకిస్తాన్‌లో ఉన్న లేక్ కొబీటుజ్ అనే ఉప్పు సరస్సు ఇలా.. చాలా సంవత్సరాలకు ఒకసారి గులాబీ రంగులోకి మారుతుంటుంది.
A 23-year-old musician, is playing in Lake Köbeituz, a salt lake in Kazakhstan ?? that turns pink every several years.
Fashion, nature, vibes … beautiful. ??— Erik Solheim (@ErikSolheim) August 6, 2022
ఇలాంటి అద్భుతమైన చోట, కజఖ్ సంగీత వాయిద్యమైన డోంబ్రాపై శ్రావ్యమైన రాగాలను ప్లే చేస్తున్న ఈ క్లిప్‌ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ వస్తున్నాయి. నెటిజన్లు భిన్నమైన కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి