Viral video: బ్లౌజ్‌ బదులు మెహెందీ డిజైన్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

మహిళలు మెహెందీని ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫంక్షన్లు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ముచ్చటపడి మరీ మెహెందీని పెట్టుకుంటారు...

Viral video: బ్లౌజ్‌ బదులు మెహెందీ డిజైన్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
Follow us

|

Updated on: Dec 02, 2021 | 7:20 AM

మహిళలు మెహెందీని ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫంక్షన్లు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ముచ్చటపడి మరీ మెహెందీని పెట్టుకుంటారు. అందులో వివిధ రకాల డిజైన్లను అనుకరిస్తూ ఆకట్టుకుంటారు. అయితే సాధారణంగా చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లటి జట్టుకు మెహెందీ(హెన్నా) వేసుకోవటం మనం చూసి ఉంటాం. అయితే ఓ మహిళ మెహెందీ బ్లౌజ్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాకెట్‌ ధరించే బదులు తన ఎద, వీపు భాగాన్ని పూర్తిగా హెన్నాతో డిజైన్‌తో చేసింది. మొదటసారి చూస్తే అది నిజమైన బ్లౌజ్‌ అనిపిస్తుంది. అయితే వీడియో సంగతేంటో కానీ జాకెట్‌కు బదులు మెహెందీతో అలంకరించుకున్న మహిళను మాత్రం నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

మహిళలు అందంగా కనిపించేందుకు భిన్నమైన చుడీదార్లు, డిజైన్‌ శారీలు, బ్లౌజులు వేసుకుంటారు. అయితే మెహెందీతో బ్లౌజ్‌ డిజైన్‌ చేసుకోవడం మాత్రం వింతగా అనిపిస్తోంది. ‘హెన్నా బ్లౌజ్… వాట్స్ నెక్స్ట్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన వీడియోను వీక్షించిన నెటిజన్లు ‘మెహెందీ డిజైన్‌ కొత్తగా ఉంది.. కానీ ఇలా బ్లౌజ్‌గా డిజైన్‌ చేయడం ఏంటి, ‘ టైలర్ ఖర్చులు మిగిలించుకునేందుకే ఆమె ఇలా మెహందీ బ్లౌజ్ అని ధరించింది’, ‘ఫ్యాషన్ పేరుతో ఇదేం పిచ్చి పని’ అంటూ ఆమెను ట్రోల్స్‌ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Thanos (@thanos_jatt)

Also Read:

WHO Omicron: ఆ పేరు చెప్పి అతి చేయొద్దు.. ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేసిన WHO ప్రతినిధులు..!

Viral Video: వరుడి వింత చేష్టలు.. వాన వెలిసేదాక ఆగలేకపోయాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..!

Moon Collides Earth: చందమామ భూమిని ఢీకొడుతుందా?.. శాస్త్రవేత్తలు చెప్పిన ఇంట్రస్టింగ్ విశేషాలు..!