Viral Video: హై హీల్స్ ధరించి ఈ మహిళ చేసే విన్యాసం చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

సాధారణంగా మహిళలు ఫ్యాషన్‌ కోసం హై హీల్స్‌ను వేసుకుంటారు. వీటిని ధరించడం బాగానే ఉన్నప్పటికీ నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే నలుగురిలో నవ్వులపాలు కాక తప్పదు.

Viral Video: హై హీల్స్ ధరించి ఈ మహిళ చేసే విన్యాసం చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

Edited By: Ravi Kiran

Updated on: Feb 23, 2022 | 8:01 AM

సాధారణంగా మహిళలు ఫ్యాషన్‌ కోసం హై హీల్స్‌ను వేసుకుంటారు. వీటిని ధరించడం బాగానే ఉన్నప్పటికీ నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే నలుగురిలో నవ్వులపాలు కాక తప్పదు. అలాంటిది ఓ మ‌హిళ మాత్రం హై హీల్స్ వేసుకుని తాడు మీద జంపింగ్‌ చేసింది. తన సృజనాత్మక ప్రతిభతో ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హైహిల్స్‌ ధరించి ఎంతో నైపుణ్యంతో ఆమె చేసిన విన్యాసానికి నెటిజన్లందరూ నోరెళ్ల బెడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన‌ ఓగ్లీ హెన్రీ అనే అథ్లెట్ ఈ రికార్డును క్రియేట్‌ చేసింది. సాంటా మోనికా బీచ్‌లో త‌ను ఈ స్టంట్‌ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కాగా హెన్రీ నైపుణ్యానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ముగ్ధులయ్యారు. తన స్టంట్‌ వీడియోను తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజన్లు ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి నెట్‌ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి

Afghanistan-India: తీవ్ర ఆహార సంక్షోభంలో ఆఫ్గన్‌ ప్రజలు.. పాక్‌ మీదుగా 2,500 టన్నుల గోధుమలను పంపిణీ చేసిన భారత్‌!

RUSSIAN INVASION: పుతిన్ ప్రకటనపై అమెరికా, యుకే ఆగ్రహం.. రష్యాపై ఆంక్షల వర్షం.. తప్పేనా ముప్పు?