Video Viral: అక్కా డేంజర్ స్టంట్స్ అవసరమా.. కాస్త ఎటమటమైతే ప్రాణాలే పోయేవి కదా

|

Aug 03, 2022 | 1:30 PM

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, కాలువలు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం తమ చేతులారా తామే ప్రమాదాన్ని...

Video Viral: అక్కా డేంజర్ స్టంట్స్ అవసరమా.. కాస్త ఎటమటమైతే ప్రాణాలే పోయేవి కదా
Woman Crossing River
Follow us on

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, కాలువలు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం తమ చేతులారా తామే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పొంగిపొర్లుతున్న నదులు, వాగులను దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ఉద్ధృతికి కింద పడి కొట్టుకుపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక అమ్మాయి బ్రిడ్జి పై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో స్కూటీని నడుపుకుంటూ దాటడానికి ప్రయత్నించింది. ఆమె సురక్షితంగానే అవతలి ఒడ్డుకు చేరినప్పటికీ.. జరగరానిది జరిగిదే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న విషయం వీడియో చూస్తున్న వారందరికీ అర్థమవుతుంది.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ అయింది. ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంతే కాకుండా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని ఆమె దాటడాన్ని నమ్మలేకపోతున్నానని, అక్క ఎందుకు ఇలా చేస్తావ్, నీ ప్రాణాన్ని పణంగా పెట్టుకోకు అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..