వార్నీ.. ఇదెక్కడి పరేషాన్‌.. ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ తగ్గినందుకు భర్తకు విడాకులు..!

సోషల్ మీడియా రీల్స్ విషయంలో తలెత్తతిన వివాదం ఓ జంటను విడదీసింది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు తగ్గిపోవడంతో తన భర్తను వదిలేసింది ఒక మహిళ. ఈ షాకింగ్‌ ఘటనతో ప్రజలకు వ్యసనంగా మారిన సోషల్ మీడియా వైవాహిక సంబంధాలపై కూడా ఇంతలా ప్రభావాన్ని చూపుతుందా అనే చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో నమోదైన ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

వార్నీ.. ఇదెక్కడి పరేషాన్‌.. ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ తగ్గినందుకు భర్తకు విడాకులు..!
Woman Leaves Husband

Updated on: Jun 12, 2025 | 9:24 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ కు చెందిన ఒక మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రతిరోజూ రెండు రీల్స్ పోస్ట్ చేసేది. అయితే, తన భర్త పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి ఇంటి పనులతో తనను బిజీగా ఉంచుతున్నాడని, అందువల్ల రీల్స్ చేయడానికి తనకు సమయం దొరకడం లేదని ఆమె ఆరోపించింది. దీనివల్ల తనకు ఫాలోవర్ల సంఖ్య తగ్గిందనే కోపంతో ఆమె హాపూర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త తనను పూర్తిగా ఇంటి పనులకే పరిమితం చేస్తున్నాడని, కాబట్టి తనకు రీల్స్ చేయడానికి సమయం దొరకడం లేదని వాపోయింది. దీంతో సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయిందంటూ ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలియటంతో ఆమె భర్త కూడా రివర్స్‌ కంప్లైట్‌ చేశాడు. అతడు కూడా మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భార్యపై ఫిర్యాదు చేశాడు. తన భార్య ఎప్పుడూ రీల్స్ చేస్తూ బిజీగా ఉండేదని, దాంతో ఇంటి పనులు నిర్లక్ష్యం చేసేదని చెప్పాడు. రీల్స్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వకపోతే తనను వదిలివేస్తానని తన భార్య బెదిరించిందని కూడా అతను ఆరోపించాడు.

ఇకపోతే, ఈ వింత ఫిర్యాదుతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ జంట గొడవను పరిష్కరించడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. కానీ, ఆ మహిళ మాత్రం రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉండాలని పట్టుబట్టింది. చివరకు పోలీసులు కౌన్సెలింగ్ ద్వారా వీరి గోడవను పరిష్కారించారు. ఆ మహిళ తన భర్తతో తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్లిపోయినట్టుగా పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి కేవలం మనుషులకు వ్యసనంగా మాత్రమే కాదు.. వ్యక్తిగత సంబంధాలపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నిరూపించింది. రీల్స్ పిచ్చితో ఇలాంటి కొందరు తమ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొన్ని సందర్భాల్లో వివాహ విచ్ఛిన్నం అయ్యే సంఘటనలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. ఈ సంఘటన సోషల్ మీడియా వాడకంపై నియంత్రణను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..