జైలు శిక్ష అనుభవిస్తున్న తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు జైలుకెళ్లింది ఓ యువతి. అక్కడ అతడితో కాసేపు మాట్లాడిన తర్వాత.. తిరిగొస్తూ అతడికి లిప్ కిస్ ఇచ్చింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి ఆ ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అమెరికాలోని టేనస్సీలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన రాచెల్ డోలార్డ్ అనే మహిళ.. డ్రగ్స్ కేసులో 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ జాషూ బ్రౌన్‌ను కలిసేందుకు టేనస్సీ జైలుకు వెళ్లింది. జాషూతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్లిపోతూ అతడికి లిప్ కిస్ ఇచ్చింది. అనంతరం కొద్దిసేపటికి జాషూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడికి ఏమైందో పోలీసులకు అర్ధం కాలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈలోపే అతడు మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. ఇక పోలీసులు అసలేమైందని సీసీఫుటేజ్ చూడగా.. నిజం బయటపడింది.
రాచెల్.. జాషూకు లిప్ కిస్ ఇచ్చినప్పుడు.. తన నోటి నుంచి 0.5 ఔన్స్ మెథాంఫెటామైన్ అనే డ్రగ్ నుంచి జాషూ నోట్లోకి బదిలీ చేసింది. దాన్ని అతడు ఎవ్వరికీ తెలియకుండా బాత్రూమ్ ద్వారా బయటికి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈలోపే అతడు దాన్ని మింగేయడంతో.. ఓవర్ డోస్ అయ్యి.. కాసేపటికే మరణించాడు. దీనితో పోలీసులు రాచెల్‌పై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె అసలు ఎందుకు ఇలా చేసిందన్న దానిపై విచారణ చేపట్టారు.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..