ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు. కానీ చాలా మంది ఆ సూచనలను పెడచెవిన పెడుతుంటారు. అలాంటివారు తమ తల్లిదండ్రులు, భార్య, ఆఖరికి పిల్లలు చెప్పినా కూడా వినరు. ఎంత చెప్పినా వినకపోయేసరికి వారు కూడా చెప్పడం మానేస్తారు. ఇక మందుబాబులు, ధూమపానం చేసేవారికి సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో మీరు ఈ పాటికి చాలానే చూసి ఉంటారు. అయితే అవన్నీ ఒక ఎత్తు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మరో ఎత్తు. అందుకే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా దీనిని మళ్లీ మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారు.
అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మహిళ సిగరెట్లకు పండు మిరపకాయల రసం రాస్తోంది. అది కూడా తీరికగా ఒక్కొక్క సిగరెట్ తీసుకుని.. పండు మిరపరసం దానికి అద్దిస్తోంది. అనంతరం తిరిగి వాటిని సిగరెట్ బాక్స్‌లో పెట్టెస్తోంది కూడా. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. బహుశా ఆ సిగరెట్లను తన భర్త వద్ద నుంచి అతనికి తెలియకుండా తీసుకుని ఉంటుంది ఆమె. స్మోకింగ్ వద్దని కూడా ఆమె తన భర్తకు ఎంత చెప్పినా వినకపోయి కూడా ఉండవచ్చు. అందుకే ఆమె ఇలా చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం