Viral Video: వేటలో చిరుతకు ఓ లెక్కుంటుంది.. ఆహారం పక్కనున్నా సైలెంట్‌గా వెళ్లిపోయింది.. కట్ చేస్తే..

|

May 16, 2022 | 6:58 PM

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నాయి. ఈ వీడియోలో ఒకే నీటి గుంట వద్ద చిరుతపులి, జింక నీరు తాగుతున్న..

Viral Video: వేటలో చిరుతకు ఓ లెక్కుంటుంది.. ఆహారం పక్కనున్నా సైలెంట్‌గా వెళ్లిపోయింది.. కట్ చేస్తే..
Deer And Leopard Were Seen
Follow us on

అడవిలోని జంతువులకు వాటి నియమాలు వాటికున్నాయి. ఇవి వాటిని పాటించకపోతే బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral Video) అవుతోంది. అంతే కాదు ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నాయి. ఈ వీడియోలో ఒకే నీటి గుంట వద్ద చిరుతపులి, జింక నీరు తాగుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇంతకీ చిరుతపులి జింకపై ఎందుకు దాడి చేయడం లేదని వీడియో చూసిన నెటిజనం ఆశ్చర్యపోతున్నారు. ఎదురుగా ఉన్న జింకలను చూసినా చిరుత ఎలా ప్రశాంతంగా ఉంటుందో అని యూజర్లకు అర్థం కాలేదు. రెండు బలహీన జంతువులు ఒక వేటాడే జంతువు ఒకే చెరువు నుంచి చాలా ప్రశాంతంగా నీరు తాగటం వీడియోలో మీరు చూడవచ్చు. ఆ జింకలను వేటాడేందుకు చిరుతపులి ఆసక్తి చూపుతున్నట్లు వీడియో చూస్తే ఎక్కడా కనిపించడం లేదు. అదే సమయంలో చిరుతపులి నుంచి జింకకు ఎలాంటి భయం కనిపించకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ వీడియో ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరచడంతో పాటు వారిని ఆలోచనలో పడేస్తుంది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. జింకలు భయం లేకుండా చిరుతపులితో కలిసి నీళ్లు తాగడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో, దోపిడీ జంతువు దురాశలో కనిపించదు..వాటిలో వేట భయం కనిపించలేదు. దీనితో పాటు, ఐఎఫ్‌ఎస్ అధికారి ‘అడవి జంతువులు క్రీడ కోసం ఎప్పుడూ చంపవు’ అని క్యాప్షన్‌లో రాశారు. అంటే అడవి జంతువులు ఆట కోసం వేటాడవు.

వీడియో చూడండి- 

IFS అధికారి షేర్ చేసిన వీడియో

భయంకరమైన జంతువులు వేటాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వేటాడతామని ఐఎఫ్‌ఎస్ అధికారి తన వీడియో ద్వారా చెప్పారు.  ఆకలితో లేకుంటే,  ఏ జంతువుకు హాని చేయవు. ఈ వీడియో బయటికి  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే భారీగా రియాక్షన్స్ వచ్చాయి. కొందరు వ్యక్తులు చిరుతపులి సాంబార్ జింకను వేటాడదని, ఎందుకంటే అది చిరుతపులిని పొట్టితనాన్ని అధిగమించగలదని కూడా అభిప్రాయపడ్డారు.