
ఈ మధ్య ఎవరికైనా ఎదైన సమస్య వస్తే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసినా వాటికి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్యను డెలివరీ కోసం చందౌసీ లో ఉన్న హరి ప్రకాశ్ నర్సింగ్ హోం కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ఆసుపత్రిలో మాత్రం దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అయితే అసద్ ఖాన్ తన భార్యను దొమలు కుట్టడంతో తట్టుకోలేకపోయాడు. ఆమె బాధను చూడలేని అసద్ మస్కిటో కిల్లర్ కొనుక్కరావడానికి బయటికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి కావడంతో దుకాణాలన్ని మూసివేసి ఉన్నాయి.
దీంతో చేసేదేమి లేక అసద్ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ట్వీట్ చేశాడు. తన భార్య ఆడబిడ్డకు జన్మనించ్చిందని.. కానీ ఇక్కడ చాల దొమలు తన భార్యను కుట్టడంచో ఆమె తీవ్రంగా బాధపడుతోందని తెలిపాడు. దొమలను చంపే కాయిల్ ను వెంటనే అందించండని వేడుకున్నాడు. దీనిపై వేగంగా పోలీసులు స్పందించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ఆసుపత్రికి చేరుకుని దోమలను చంపే కాయిల్ ను ఇచ్చారు. ఇంత త్వరగా స్పందించి తనకు సహాయం చేసినందుకు అసద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..