Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలు ఎందుకు పెంచుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట..!

ఉత్తరప్రదేశ్‌లోని ఈ తాజ్ మహల్‌ను చూడటానికి దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, తాజ్ మహల్ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించినట్టయితే.. అక్కడన్నీ తులసి మొక్కలు పెంచుతున్నారు. ఇలా తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎందుకు అంతలా పెంచుతున్నారు...? దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలు ఎందుకు పెంచుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట..!
Taj Mahal

Updated on: Jun 21, 2025 | 4:42 PM

తాజ్ మహల్.. ప్రపంచ వింతలలో ఒకటి. తాజ్ మహల్‌ను నిజమైన ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. చక్రవర్తి షాజహాన్ తన భార్య బేగం ముంతాజ్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఈ తాజ్ మహల్‌ను చూడటానికి దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, తాజ్ మహల్ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించినట్టయితే.. అక్కడన్నీ తులసి మొక్కలు పెంచుతున్నారు. ఇలా తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎందుకు అంతలా పెంచుతున్నారు…? దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తులసి మొక్కలు ఔషధ గుణాలు కలిగినవి. ప్రతిరోజూ దాదాపు 20 గంటల పాటు ఆక్సిజన్ ను విడుదల చేస్తూనే ఉంటాయి తులసి మొక్కలు. ఇక మిగతా నాలుగు గంటలు ఓజోన్ వాయువును విడుదల చేస్తాయి. తులసి మొక్క తన చుట్టూ 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. దీనివల్లే తులసి ఉన్నచోట కీటకాలు కనిపించవు. అందుకే తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎక్కువగా నాటారు. తులసి మొక్కల వల్లే తాజ్ మహల్ పై క్రిమి కీటకాలు చేరకుండా రక్షణ లభిస్తోంది. తులసి నుండి వెలువడే ఓజోన్ వాయువు.. సూర్యుని హానికరమైన కిరణాల నుండి తాజ్ మహల్‌ను రక్షిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

తులసి మొక్కలను పెంచడం ద్వారా, ఎటువంటి సూక్ష్మక్రిములు, కీటకాలు తాజ్ మహల్‌లోకి ప్రవేశించలేవు. కాబట్టి తాజ్ మహల్ గోడలు, నేల శుభ్రంగా ఉంటాయి. తులసి మొక్కల కారణంగా తాజ్ మహల్ చుట్టూ ఉన్న గాలి కూడా శుభ్రంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..