
ఈ రోజుల్లో విద్యార్థులను పాఠశాలకు దింపడానికి స్కూల్ బస్సుల వాడకం పెరిగింది. దాదాపు ప్రతీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సుల ద్వారా పాఠశాలకు వస్తారు. అయితే ఒక విషయం గమనించారా? అది ఏ స్కూల్ బస్ అయినా సరే ఎల్లో కలర్‌లోనే ఉంటుంది. అలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క మన దేశంలోనే ప్రపంచ వ్యాప్తంగా స్కూల్ బస్సులన్నీ ఎల్లో కలర్‌లోనే ఉంటాయి. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి ఎల్లో కలర్ వెనుక సైన్స్ ఉంది.
అందుకే పసుపును ట్రాఫిక్ లైట్లలో, ప్రమాదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. పసుపు రంగు ఎరుపు కంటే లాటరల్ పెరిఫెరల్ దృష్టిని ఎక్కువగా కలిగి ఉంటుంది. పసుపు రంగుకు ఒక ప్రత్యేకత ఉంది. వర్షంలో, ఎండలో లేదా పొగమంచులో కూడా ఈ రంగును సులభంగా చూడవచ్చు. అందుకే స్కూల్ బస్సు రంగు పసుపు రంగులో ఉంటుంది. ముందు నుండి వచ్చే వాహనం స్కూల్ బస్సును త్వరగా చూడగలిగేలా స్కూల్ బస్సు రంగు పసుపు రంగులో ఉంటుంది.
పసుపు రంగు అప్రమత్తతకు చిహ్నం. చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సులకు పసుపు రంగు వేస్తారు. పసుపు రంగు కనిపించినప్పుడు, సంబంధిత బస్సులో చిన్న పిల్లలు ఉన్నారని, మనం నెమ్మదిగా నడపాలని సందేశాన్ని పంపడానికి స్కూల్ బస్సులకు కూడా పసుపు రంగు వేస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..