Milk Frog: మనిషి అభివృద్ధి, ఆవిష్కరణల గురించి ఎన్ని వాదనలు చేసినా వాస్తవం ఏమిటంటే, నేటికీ ప్రకృతి రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో మనిషి విఫలమవుతూనే ఉన్నాడు. ప్రకృతి ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. దాని గురించి తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. ప్రతిసారీ ఏదో ఒకటి వెలుగులోకి వచ్చినప్పుడు ఈ విషయాలపై అందరి చూపు పడుతుంది. ఈ రోజుల్లో కూడా అలాంటిదే ఒకటి చర్చల్లో నిలిచింది.
భూమిపై ప్రకృతిచే సృష్టించబడిన మిలియన్ల జీవులు ఉన్నప్పటికీ, మానవులకు ఏజీవి గురించి కూడా పూర్తిగా తెలియదు. అలాంటి జీవి ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఓ తెల్లటి రంగు కప్ప వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో ఒక తెల్ల కప్పను చూడొచ్చు. ఇది రోబోట్‌లా కనిపిస్తుంది. కప్ప కళ్ళు లెన్స్ లాగా పైకి స్థిరంగా ఉన్నాయి. గోళ్ళలో నీలం రంగు నిర్మాణం ఉంటుంది. కానీ, వాస్తవానికి చూస్తే ఇది తెల్లటి పాలవలె కనిపిస్తున్న కప్ప. ఈ వీడియో చూసిన తర్వాత కప్ప కూడా తెలుపు రంగులో ఉందని, చూడటానికి అందంగా కనిపిస్తుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ రకమైన కప్పలు ప్రపంచంలో ప్రతిచోటా కనిపించినా.. ఇది మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది.
Thanks to Twitter, I am learning every day something about animals and how beautiful they are?
The Amazonian milk frog (Trachycephalus resinifictrix) is a rather large amphibian, found in wet and vegetated areas around the Amazon River???
— Tansu YEĞEN (@TansuYegen) August 3, 2022
ఈ కప్పను అమెజానియన్ మిల్క్ ఫ్రాగ్ అని పిలుస్తారంట. దాని శరీరాన్ని చూసి దీనిని మిల్క్ ఫ్రాగ్ అని ఎందుకు పిలుస్తారో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కప్ప చాలా విషపూరితమైనది. దాని చర్మం మాంసాహారుల నుంచి రక్షిస్తుంది. వాస్తవానికి, దాని చర్మంలో విషం ఉంది. దీని కారణంగా వేటగాళ్ళు ఎక్కువగా వాటికి దూరంగా ఉంటారు. ఈ కప్పలు చెట్లలో, మొక్కల చుట్టూ నివసిస్తాయి. వాటి పాదాల సహాయంతో ఎక్కుతాయి.