Watch Video: ఓరీ దేవుడో.. వేగంగా వెళ్తున్న వాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.. ఆ తర్వాత జరిగిన దారుణం..!

|

Apr 28, 2024 | 4:42 PM

ఈ వీడియోను షేర్ చేసిన వారు.. హైవేపై నడుస్తున్న ట్రక్కు చక్రాలకు ఎంత పవర్ ఉంటుందో చూశారా అంటూ క్యాప్షన్‌లో రాసి ఉంది. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరమని, చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని మరొకరు రాశారు. ట్రక్కు డ్రైవర్‌పై చర్యలు తీసుకోకూడదని కూడా కొందరు రాశారు. ఇంత జరిగినా ట్రక్కు డ్రైవర్‌..

Watch Video: ఓరీ దేవుడో.. వేగంగా వెళ్తున్న వాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.. ఆ తర్వాత జరిగిన దారుణం..!
Wheel Of Moving Truck
Follow us on

వేగంగా వెళ్తున్న వాహనానికి టైర్ ఊడిపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కదులుతున్న వాహనం టైరు ఊడిపోవడంతో ఊహించని ఘటన చోటుచేసుకున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కు చక్రాల నుంచి రెండు టైర్లు ఊడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో అంతే వేగంగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వేగంగా వెళ్తున్న ట్రక్కు చక్రాలు ఊడిపోవడంతో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఆ షాకింగ్‌ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కనిపించింది. ట్రక్కు వెనుక ఒక కారు వెళ్తోంది. అందులో డాష్‌బోర్డ్ కెమెరా అమర్చబడి ఉంది. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది. ముందుగా ఈ కారు ముందు వెళ్తున్న ట్రక్కుకు ఉన్న టైర్లలో ఒకటి ఊడిపోయింది.. వాహనం కంటే వేగంగా ఆ టైర్‌ రోడ్డు మధ్యలో పరుగెడుతూ..రోడ్డు అవతలి వైపుకు వెళ్లింది.. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత లారీ టైరు మరో వైపు దూసుకెళ్లింది..వేగంగా ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టైరు ఢీకొనడంతో ఆ స్తంభం విరిగి నేల కూలిపోయింది. అయితే, ఇదంతా చూస్తున్న కారు డ్రైవర్‌ అప్రమత్తతో వెంటనే తన వేగాన్ని తగ్గించాడు. దాంతో అతను ఎటువంటి ప్రమాదానికి గురవకుండా తప్పించుకోగలిగాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోను షేర్ చేసిన వారు.. హైవేపై నడుస్తున్న ట్రక్కు చక్రాలకు ఎంత పవర్ ఉంటుందో చూశారా అంటూ క్యాప్షన్‌లో రాసి ఉంది. ఒక్క స్తంభాన్ని మాత్రమే కూల్చివేసింది. అదే కారును ఢీకొట్టి ఉంటే కారు ఛిన్నాభిన్నమై ఉండేదని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. ఇది భారీ చక్రం, దాని బరువు కూడా అంతే ఉంటుందని ఒకరు రాశారు. ఎవరైనా దీనికి ఎదురుపడితే తప్పించుకోవడం కష్టమే అన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరమని, చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని మరొకరు రాశారు. ట్రక్కు డ్రైవర్‌పై చర్యలు తీసుకోకూడదని కూడా కొందరు రాశారు. ఇంత జరిగినా ట్రక్కు డ్రైవర్‌ పసిగట్టలేదు. వాహనాన్ని ఆపలేకపోయాడు. అందుకే ఎప్పటికప్పుడు వాహనాన్ని సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..