జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జపాన్‌కు వెళ్లే బోయింగ్ 777 జెట్‌లైనర్ గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ ఊడిపోయి కిందకు పడిపోయింది.. విమానాశ్రయ పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లింది టైర్. 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ అసెంబ్లీలో ఆరు టైర్లలో ఒకటి ఉన్నట్టుండి ఊడిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో పడిపోయిన టైర్ వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఒక కారు అద్దం పగిలిపోయేలా చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. అక్కడ బోయింగ్ 777 ల్యాండింగ్ విషయంలో సమస్యలు వచ్చాయి. రన్‌వేలో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ విమానాన్ని తోసుకుంటూ, లాకెళ్లారని తెలిసింది.
✈️United flight UA35 diverted to Los Angeles today after losing a wheel on takeoff 🚨 Via @FlightEmergency
View #UA35's data at
https://t.co/F63EfWkMAN pic.twitter.com/0bSSQE6UKu— RadarBox (@RadarBoxCom) March 7, 2024
2002లో నిర్మించిన ఈ విమానం పాడైపోయిన టైర్లతో కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపొందించినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించినట్టుగా అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి విచారణ జరుపుతున్నట్టుగా వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలుగలేదు. అంతా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..