
ఈ చిత్రాన్ని చూసినప్పుడు మీకు మొదటగా ఏం కనిపించింది అనే దానిపై మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మీకు ఒక వ్యక్తి ముఖం.. ముఖ్యంగా అరుస్తున్నట్లుగా కనిపిస్తే.. మీరు లోతైన ఆలోచనలతో జీవించే వ్యక్తి అని అర్థం. అంటే మీరు అంతర్ముఖ స్వభావం కలవారు. మీ బలాలు, బలహీనతల గురించి మీకు బాగా తెలుసు. మీ భావోద్వేగాలను విశ్లేషించుకునే శక్తి మీకు ఉంటుంది.
అంతేకాకుండా మిమ్మల్ని మీరు అంగీకరించే గుణం కూడా మీలో కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మీ మనసులోంచే వస్తుంది. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే.. మీపై మీరు ప్రేమతో, ఓపికతో ఉండండి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లోపాలుంటాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పవి.
మీకు ఒక చేయి.. ప్రత్యేకంగా పలకరిస్తున్నట్లుగా ఉన్న చేయి కనిపిస్తే.. మీలో సమస్యలను త్వరగా పరిష్కరించే గుణం ఉందని అర్థం. మీరు ఒత్తిడి, అప్రమత్తత వంటి క్లిష్ట పరిస్థితుల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అనుకోని అడ్డంకులను సులువుగా ఎదుర్కొని ముందుకు సాగగలిగే ధైర్యం మీలో ఉంది. మీరు సానుకూలతతో నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే ఈ రకమైన వ్యక్తుల్లో ఒక చిన్న సమస్య మాత్రం ఉంటుంది.. చిన్న విషయాల్లో తడబాటు. ఉదాహరణకు బయటకు వెళ్లి తినాలనుకున్నప్పుడు ఎక్కడ తినాలి..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడంలో జాప్యం చేయడం, ఎక్కువ ఆలోచించడమే సమస్య. చిన్న చిన్న ఎంపికలపై ఎక్కువగా ఆలోచించడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది.
ఈ టెస్టులో మీకు వచ్చిన ఫలితాలు మీకు ఎంతవరకు సరిపోయాయి..? మీ ఆత్మవిశ్వాసాన్ని బట్టి మీరు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారా.. లేక సమస్యలను సూటిగా ఎదుర్కొంటారా..?
మీరు ఈ విషయాన్ని మీ గురించి తెలుసుకోవడమే కాకుండా.. మీ స్నేహితులతో కూడా పంచుకోండి. దానివల్ల వారి మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకరినొకరు ఇంకా బాగా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ లు కేవలం సరదా కోసమే కాదు.. మన వ్యక్తిత్వం గురించి మనం మరింత బాగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.