Strawberry Challeng: ఇంటర్నెట్‌లో సంచలనం..యువతని ఆకట్టుకున్న స్ట్రాబెర్రీ ఛాలెంజ్.. నియమాలు ఏమిటంటే

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ ఇలా రకరకాల ఛాలెంజ్ లో నెట్టింట్లో చక్కర్లు కొట్టగా ప్రస్తుతం పొరుగు దేశమైన చైనాలో యువత  సరికొత్త ఛాలెంజ్ మోజులో పడిపోయింది. దీని గురించి తెలిస్తే మీరు ఒక్కసారి ట్రై చేస్తే పోలే అనుకుంటారు. స్ట్రాబెర్రీ ఛాలెంజ్ జోరుగా సాగుతుండగా.. ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసేందుకు యూత్ క్యూ కడుతున్నారు. 

Strawberry Challeng: ఇంటర్నెట్‌లో సంచలనం..యువతని ఆకట్టుకున్న  స్ట్రాబెర్రీ ఛాలెంజ్.. నియమాలు ఏమిటంటే
Strawberry Sucking Craze
Image Credit source: SCMP composite/Xiaohongshu

Updated on: Feb 07, 2024 | 9:06 PM

సోషల్ మీడియా అరచేతిలో దర్శనం ఇచ్చే ఒక చిన్న ప్రపంచం. ఇక్కడ ఏదైనా వైరల్ అయితే.. చాలు ఇతర వ్యక్తులు కూడా అదే చేయడానికి పోటీపడతారు. అయితే ఏది ఎప్పుడు ఏ విషయం కొత్తగా ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏదో ఒక సమయంలో నెటిజన్లు హాస్యాస్పదమైన పనులు చేయడం.. వాటిని ఛాలెంజ్ పేరుతో వదలడం.. దానిని ఇతరులు క్రేజీగా ఫాలో కావడం తరచుగా జారుతూనే ఉంది. ఇప్పటికే ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ ఇలా రకరకాల ఛాలెంజ్ లో నెట్టింట్లో చక్కర్లు కొట్టగా ప్రస్తుతం పొరుగు దేశమైన చైనాలో యువత  సరికొత్త ఛాలెంజ్ మోజులో పడిపోయింది. దీని గురించి తెలిస్తే మీరు ఒక్కసారి ట్రై చేస్తే పోలే అనుకుంటారు. స్ట్రాబెర్రీ ఛాలెంజ్ జోరుగా సాగుతుండగా.. ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసేందుకు యూత్ క్యూ కడుతున్నారు.

స్ట్రాబెర్రీలు తినేందుకు చైనాలో యువతలో పోటీ నెలకొంది. అయితే స్ట్రాబెర్రీలను తినడంలో ఒక చిన్న మెలిక కూడా ఉంది. స్ట్రాబెర్రీలను ఎలా తినాలనే విషయంలో సవాల్. ఛాలెంజ్ లో భాగంగా పెట్టిన  కండిషన్ చాలా విచిత్రమైనది.

స్ట్రాబెర్రీ ఛాలెంజ్ ఇలా ట్రెండ్‌లోకి వచ్చింది

చైనా సోషల్ ప్లాట్‌ఫారమ్  ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు జియాహాంగ్షులో జనవరి 11న ఒక పోస్ట్ వైరల్ కావడంతో ఈ వింత ట్రెండ్ మొదలైంది. సవాలు గురించి సమాచారం ఇస్తూ @Aqing అనే వినియోగదారు స్ట్రాబెర్రీని ఎలా తినాలి అనే దాని గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించారు.

స్ట్రాబెర్రీ ఛాలెంజ్ అంటే ఏమిటి?

ఛాలెంజ్ లో పాల్గొనేవారు స్ట్రాబెర్రీలను తినడానికి తమ దంతాలను ఉపయోగించకూడదు. విత్తనాలను, తెల్లటి గుజ్జుని మింగేయకుండా.. కేవలం స్ట్రాబెర్రీ ఎర్రటి గుజ్జును మాత్రమే నోట్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఇలా స్ట్రాబెర్రీని చప్పరించి స్ట్రాబెర్రీ కి చెందిన ‘అస్థిపంజరం’ నీటితో నిండిన గ్లాసులో విడిచి పెట్టాలి. ఇది  అందంగా నీటిలో తేలియాడుతుంటే అతనే సవాలులో విజేత అవుతాడు.

భారీ సంఖ్యలో ఛాలెంజ్ ను స్వీకరించిన యువత

సోషల్ మీడియాలో స్ట్రాబెర్రీలను పీలుస్తున్న చిత్రాల వరదగా పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఒకరినొకరు ‘లీచ్ గాడ్’ అని పిలుచుకోవడం ఆనందించారు, అయితే కొందరు ఈ ఛాలెంజ్‌ని చాలా ఇష్టపడ్డారు. అదే సమయంలో కొంతమంది అనుభవజ్ఞులైన వినియోగదారులు ఇందులో విజయం సాధించడానికి సలహాలు కూడా ఇచ్చారు. ఈ ఛాలెంజ్ లో విజయం స్ట్రాబెర్రీని ఎంచుకోవడంలోనే సగం ఉందని.. ఎరుపు రంగు ఉన్న స్ట్రాబెర్రీలను ఎంచుకోండి అని సలహా ఇస్తారు. ఒక జియాహోంగ్షు వినియోగదారు ఈ ఛాలెంజ్‌లో ఎంతగానో ఆకట్టుకున్నారు.. ఆమె కివీ ..  పియర్‌ని పీలుస్తున్న ఫోటోను కూడా షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..