
గత కొద్ది రోజులుగా విమానయాన పరిశ్రమ సంక్షోభంలో ఉందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానంలో ప్రయాణించే వారిని ఆ దేవుడో రక్షించాలి అన్నట్టుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన సంఘటనలు చూస్తుంటే ఈ మాటలు వాస్తవమనే అనిపిస్తుంది. ఆకాశంలో విమానం చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. ఈ సమయంలో భూమి నుండి దాని ఎత్తు అనేక వేల అడుగులో ఎగురుతుంది. ఈ సమయంలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు దాని కిటికీ తెరుచుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..?
నిపుణుల విరణ మేరకు.. విమానం ఆకాశంలో ఉండగా, కిటికీ తెరుచుకోవటం దాదాపు అసాధ్యమే..అయినప్పటికీ, ఒక్కోసారి అలాంటి వార్తలు కూడా వినాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న స్పైస్‌జెట్ విమానం గాల్లో ఉండగా, కిటికీ తెరుచుకోవటం గందరగోళానికి దారి తీసింది. గోవా నుంచి పుణే వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పైస్‌జెట్ విమానం SG1080 ఫ్లైట్ గగనతనంలో ఉండగా కిటికీ సగం తెరుచుకున్నట్లు ప్రయాణికులు గమనించారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, ల్యాండ్ అయిన తర్వాత సమస్యను పరిష్కరించామని సంస్థ స్పష్టం చేసింది.
ఏది ఏమైనప్పటికీ ఇలా విమానం గాల్లో ఎగురుతుండగా, కిటికీ ఓపెన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇది జరిగిన వెంటనే క్యాబిన్ బయట ఒత్తిడి తగ్గడం ప్రారంభిస్తుంది. ఒక విధంగా, దీనిని క్యాబిన్ డిప్రెషరైజేషన్ అని పిలవవచ్చు. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అధిక గాలి పీడనం కారణంగా, వదులుగా ఉన్న వస్తువులు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఈ విషయాలు సాధారణ సమాచారం ఆధారంగా మాత్రమే అందించటం జరిగింది. కేవలం అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..