ఈ ప్రపంచం ఎన్నో జీవుల సమాహారం. వాటిలో కొన్నింటి గురించి మనకు తెలిసి ఉండదు. మనుషులకు తెలియని ఎన్నో వింత జీవులు ఎక్కడో ఓ చోట తిరగాడుతూనే ఉంటాయి. . నేటికీ, అవి మానవులకు తారసపడకపోవొచ్చు. అలాంటి వింత జీవులను అరుదుగా ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో పరిధి పెరగడంతో ఇలాంటి వీడియోలు ఇప్పుడు చాలానే కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని రహస్య జీవులు నీటి అడుగున కనిపిస్తున్నాయి. ఆ వీడియోను కూడా మీరూ ఓ లుక్కేయండి..
What kind of fish is this? 😳 pic.twitter.com/jRHQjt1G8q
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 1, 2024
సోషల్ మీడియాలో వైరల్
ఈ వీడియో Xలో @AMAZlNGNATURE అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇందులో రెండు మర్మమైన జీవులు ఈత కొడుతున్నాయి. రెండూ పాముల్లా కనిపిస్తున్నాయి. ఇటువంటి జీవులు తరచుగా యానిమేషన్ చిత్రాలలో కనిపిస్తాయి. వాటి ఆకారం కూడా విచిత్రంగా ఉంది. వీడియోలో, రెండు ఆశ్చర్యకరమైన జీవులు నీటి అడుగున ఈత కొడుతూ కనిపించాయి. ఈ పాములాంటి జీవికి తలపై చేపల మాదిరి రెక్కలు ఉన్నాయి. అయితే ఆ రెక్కులు జుట్టులాగా ఉన్నాయి. అంతేకాకుండా వాటి శరీరంపై విచిత్రమైన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి.
ఈ 9 సెకన్ల వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాటిని ఓర్ఫిష్ అని పిలుస్తారని కొందరు అంటున్నారు. “డూమ్స్‌డే ఫిష్” అని కూడా పిలుస్తారని మరికొందరు చెబుతున్నారు.