Viral: పెళ్లి వేడుక కవర్ చేసేందుకు వచ్చిన వీడియోగ్రాఫర్.. సాయంత్రానికి ఆమెతో పరార్

|

Mar 14, 2024 | 12:39 PM

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వివాహాన్ని కవర్ చేయడానికి నియమించుకున్న వీడియోగ్రాఫర్ వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. జిల్లాలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడని మహిళ తండ్రి లక్ష్మణ్ రాయ్ ఫిర్యాదు చేశారు.

Viral: పెళ్లి వేడుక కవర్ చేసేందుకు వచ్చిన వీడియోగ్రాఫర్.. సాయంత్రానికి ఆమెతో పరార్
Wedding Videographer
Follow us on

పెళ్లికి వీడియో షూట్ చేయడానికి వచ్చిన ఓ వీడియోగ్రాఫర్..  పెళ్లికొడుకు మైనర్ సోదరి ట్రాప్ చేశాడు. పెళ్లి తంతు ముగియగానే ఆమెను తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. బీహార్ చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ వీడియోగ్రాఫర్ వరుడి.. సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి అహియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మార్చి 6న తన కూతురు ఇంటి నుంచి మార్కెట్‌కి వెళ్లిందని.. తిరిగి రాలేదని బాలిక తండ్రి  లక్ష్మణ్ రాయ్ పోలీసులకు తెలిపాడు. వీడియోగ్రాఫర్ తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. లక్ష్మణ్ రాయ్ తన కొడుకు పెళ్లి ఫోటోలు, వీడియోలు తీయడానికి అదే వీడియోగ్రాఫర్‌ని మాట్లాడుకున్నాడు. మార్చి 6న గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపు కోసం మరో ఊరు వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి వేడుకను కవర్ చేయడానికి వరుడి బావ గ్రామ వీడియోగ్రాఫర్‌ని పిలిచాడు. అంతా బాగానే జరిగింది. ఇంతలో పెళ్లికొడుకు సోదరి సాయంత్రం బజారుకు వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండు రోజులు గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. ఇంతలో వీడియోగ్రాఫర్ ఆమెను తీసుకెళ్లినట్లు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు బాలిక కోసం గాలిస్తున్నారు.

తన కుమారుడి పెళ్లికి వచ్చిన వీడియోగ్రాఫర్ మాయమాటలు చెప్పిన తన కుమార్తెను తీసుకెళ్లినట్లు ఇరుగు పొరుగు వారు చెప్పారని, దీంతో నిందితుడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిని గోలు కుమార్‌గా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అహియాపూర్ పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..