Viral Video: పెళ్లి వేడుకలో లొల్లి.. నడి రోడ్డుపై చిత్తుగా కొట్టుకున్న బంధువులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

పెళ్లంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఈ ప్రత్యేకమైన రోజున ఇరువురి  కుటుంబసభ్యులు... బంధువులు.. స్నేహితులతో ఎంతో సందడి సందడిగా ఉంటుంది.

Viral Video: పెళ్లి వేడుకలో లొల్లి.. నడి రోడ్డుపై చిత్తుగా కొట్టుకున్న బంధువులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral

Updated on: Feb 21, 2022 | 5:24 PM

పెళ్లంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఈ ప్రత్యేకమైన రోజున ఇరువురి  కుటుంబసభ్యులు… బంధువులు.. స్నేహితులతో ఎంతో సందడి సందడిగా ఉంటుంది. పెళ్లి వేడుకలు మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తుంటారు. మేళ తాళాలు, డ్యాన్సులు.. పాటలు.. ఆటలు ఇలా ఒక్కటేమిటీ పెళ్లింట్లో ఉండే సందడే వేరు. పెళ్లి వేడుకలో అందరు ఎంతో సంతోషంగా ఆడిపాడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వివాహ వేడుకలో అనుహ్యమైన సంఘటనలు జరుగుతాయి. పెళ్లి తంతు జరుగుతుంటే చిన్న చిన్న సంఘటనలు జరగడం కామన్.. కానీ కొన్నిసార్లు చిన్నగా మొదలై గాలివానగా మారుతుంటాయి. ఇలా పెళ్లిళ్లో గొడవలు జరుగుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఇలాంటి గొడవలు కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లికి వచ్చిన బంధువులు నడిరోడ్డుపై చిత్తుగా కొట్టుకున్నారు. సిడ్నీ సబర్బ్‏లోని అప్ మార్కెట్‏లో ఓ వివాహ వేడుక జరుగుతుంది. ఎంతో సంతోషంగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుకలో అనుహ్యంగా చిన్న గొడవ మొదలైంది. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి ఇరువురు కొట్టుకునేంతవరకు వెళ్లింది. కొందరు నడిరోడ్డుకు పైకి వచ్చి విచక్షణరహితంగా కొట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అదేం పట్టనట్లుగా మరోవైపు కొందరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఘటన సిడ్నీలోని ఉత్తర తీరంలోని మోస్మాన్‏లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో అశ్విని తండ్రి మృతి..

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us