Viral Video: పెళ్లి ఫోటోషూట్ కోసం వెళ్లిన కొత్త జంటకు షాక్.. ఒక్కసారిగా అందరూ నవ్వులు.. ఏం జరిగిందంటే.!

Viral Video: ఇటీవల ఫొటో షూట్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది.. పెళ్లి, పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేకించి ముందుగానే ఫోటో షూట్ నిర్వహించుకుంటున్నారు.

Viral Video: పెళ్లి ఫోటోషూట్ కోసం వెళ్లిన కొత్త జంటకు షాక్.. ఒక్కసారిగా అందరూ నవ్వులు.. ఏం జరిగిందంటే.!
Funny Wedding Shoot

Updated on: May 26, 2021 | 10:12 AM

Viral Video: ఇటీవల ఫొటో షూట్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది.. పెళ్లి, పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేకించి ముందుగానే ఫోటో షూట్ నిర్వహించుకుంటున్నారు. కొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ మరీ ఫొటో షూట్‌లు తీసుకుంటున్నారు. ఇక మరికొందరు చేసిన ఫోటో షూట్ లతో విమర్శలకు కూడా గురవుతుంటారు. అయితే ఇక్కడ ఒక జంట కూడా కాస్త వెరైటీగా ఫోటో షూట్‌ ట్రై చేసింది. కానీ, పాపం ప్రయత్నం బెడిసికొట్టి… నిండామునిగారు. అది ఎలా జరిగింది ? ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..

ఆ వీడియోలో.. పెళ్లి తంతు ముగిసింది. కొత్త జంట మురిసింది. బంధువులు స్నేహితులతో కలిసి నవ దంపతులు సరదాగా ఫోటోలు తీసుకుంటున్నారు. వీరి పెళ్లి ఫోటోలు మరింత ప్రత్యేకంగా ఉండాలనే ఆశతో నది ఒడ్డున చెక్కతో తయారు చేసిన వంతెనపై ఫోటో షూట్‌ పెట్టుకున్నారు. వధువరులతో పాటు మరికొంతమంది వంతనెపై ఫోటోకు ఫోజులిస్తూ నిలబడ్డారు. పాపం ఇంతలోనే ఆ వంతెన కాస్తా విరిగిపోయింది. దీంతో వారంతా నీళ్లలో పడిపోయారు. నది లోతు ఎక్కువగా లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆకస్మాత్తుగా జరిగిన ఆ ఘటనతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇదంతా అక్కడే ఉన్న కెమెరామెన్‌ వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను నెట్‌లో షేర్‌ చేయటంతో నెటిజన్లు సైతం తెగ నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం.. ఫోటోషుట్‌ కోసం వెళ్లితే…నిండా మునిగిపోయారే అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి..

వీడియో..

Read More: పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకొస్తారా? వీటి ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

Akilesh: ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటే ముందు ఆ ప‌ని చేయాల్సిందే.. తెర‌పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చిన అఖిలేష్ యాద‌వ్‌..

పోలీస్ ఇంటరాగేషన్ సందర్భంగా భోరున విలపించిన రెజ్లర్ సుశీల్ కుమార్, పొంతన లేని సమాధానాలతో ఖాకీలు బేజారు