Watch Video: శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. వీడియో చూస్తే మీరూ అవుననే అంటారు..!

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలు జనాలను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడో రొడ్డు పక్కన ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. అమె పక్కనే ఉన్న ఒక భారీ గొడ కూలిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. వీడియో చూస్తే మీరూ అవుననే అంటారు..!
Wall Collapse

Updated on: Sep 16, 2025 | 5:40 PM

ఉత్తరాది రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇటీవల జార్ఖండ్‌ లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే రాంచీలో ఒక మహిళ రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుండగా.. భారీ వర్షానికి నానిన ఒక భారీ గోడ ఆమె పక్కనే కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఆమె ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో తప్పించుకుంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో ప్రకరాం.. భారీగా కురిసిన వర్షాలతో రోడ్డుపై నీరు నిలువడంతో వాటిని దాటి వెళ్లేందుకు ఓ మహిళ రోడ్డుకు ఒకవైపు గోడను పట్టుకొని ముందుకు వెళ్తోంది. సరిగ్గా అదే సమయానికి అవతలివైపు ఉన్న మరో భారీ గోడ ఒక్కసారిగా ఆమె పక్కనే కుప్పకూలింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. ఆ గోడ కాస్తా ముందుకు పడినా అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండేది. అదృష్టవశాత్తు ఆమె ఈ ప్రమాదం నుంచి రెప్పపాటుతో తప్పించుకుంది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.