Viral Video: పట్టపగలు మెర్సిడెస్‌ బెంజ్‌ కారును తగులబెట్టిన వ్యక్తిని సపోర్టు చేస్తున్న నెటిజన్లు! పెద్దొళ్ల బుద్ధులు చిన్నవంటూ ఫైర్..

|

Sep 14, 2022 | 6:50 PM

యజమానిపై కక్షతో ఓ వ్యక్తి కోట్ల విలువ చేసే మెర్సిడెస్‌ కారును పట్టపగలు తగులబెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పట్టపగలు ఓ వ్యక్తి మెర్సిడెస్ కారును తగలబెడుతున్న..

Viral Video: పట్టపగలు మెర్సిడెస్‌ బెంజ్‌ కారును తగులబెట్టిన వ్యక్తిని సపోర్టు చేస్తున్న నెటిజన్లు! పెద్దొళ్ల బుద్ధులు చిన్నవంటూ ఫైర్..
Mercedes
Follow us on

Man in Noida sets Mercedes-Benz on fire. here’s whole story: యజమానిపై కక్షతో ఓ వ్యక్తి కోట్ల విలువ చేసే మెర్సిడెస్‌ కారును పట్టపగలు తగులబెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పట్టపగలు ఓ వ్యక్తి మెర్సిడెస్ కారును తగలబెడుతున్న వీడియో వైరల్‌ హల్‌చల్ చేస్తోంది. యజమాని ఇంటిలో ఫ్లోరింగ్‌కు టైల్స్ ఏర్పాటు చేసిన తర్వాత అతనికి చెల్లించవల్సిన మొత్తం డబ్బును ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి లగ్జరియస్‌ కారును తగులబెట్టి, బైక్‌పై వెళ్లడం ఈ వీడియోలో కన్పిస్తుంది. మెర్సిడెజ్‌ బెంజ్‌ కారుకు నిప్పంటించి, పరారైన ఘటన సమీపంలోని కెమెరాలో రికార్డయ్యింది. కెమేరా ఫుటేజీలో రికార్డయిన ఆధారాల మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఐతే ఈ వీడియోకు లక్షల్లో వీక్షణలు, లైకులు రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ‘పలుకుబడి ఉన్న చాలా మంది పనులు పూర్తైన తర్వాత డబ్బు చెల్లించరు. పైగా ఇంటి చుట్టూ తిప్పించుకుంటారు. ఇంతకంటే బెటర్‌గా హ్యాండిల్‌ చేయవచ్చని నేననుకుంటున్నాను అని ఒకరు, నోయిడాలో ఇటువంటి సంఘటనలు రోజుకి ఒకటి, రెండు జరుగుతూనే ఉంటాయి. శ్రీమంతులకు ఇలాంటి ఎఫెక్టులు తప్పవని మరొకరు, ‘మనదేశంలో పేదలు, బలహీనుల పట్ల ఇటువంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయని ఇంకొకరు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధికమంది నెటిజన్లు మత్రం.. పేద కూలీని దోపిడి చేయడం క్షమించరాని నేరమని సదరు వ్యక్తి చర్యను సపోర్టు చేస్తూ.. మెర్సిడెస్ యజమానిని తిట్టిపోశారు. మరికొందరేమో అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించాలి. అంతేగాని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితబోధ చేశారు. మరి మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

నిందితుడు రణవీర్ అనే తాపీ మేస్త్రీ. కొంతకాలం క్రితం తన ఇంట్లో టైల్స్‌ వేయించుకున్న మెర్సిడెస్ కారు యజమాని పూర్తి డబ్బు చెల్లించకపోవడంతో, రణవీర్ కారును తగుల బెట్టాడు. ఐతే యజమాని ఫిర్యాదు మేరకు గంటల వ్యవధిలోనే పోలీసులు రణవీర్‌ను అరెస్టు చేశారు.