మీరు తప్పనిసరిగా తేలును చూసే ఉంటారు. పాముల వలె , ఇవి కూడా చాలా ప్రమాదకరమైన జీవులు. తేలు కాటు కూడా విషపూరితమైనదే. కొన్ని తేళ్లు మరింత ప్రమాదకరమైనవి. తేలు కాటువేస్తే కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంటుంది.. కొన్ని కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి గురవుతారు. కాబట్టి, ఈ ప్రమాదకరమైన జీవులకు దూరంగా ఉండటం మంచిది. అయితే, కొంతమంది తేళ్లను పెంచుకుంటారని, కొందరు వాటిని తింటారని మీకు తెలుసా.? ప్రస్తుతం తేలుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలను షాక్ కు గురి చేసింది.
పొదిగేసిన గుడ్ల నుండి తేళ్లు..
సాధారణంగా కోడిగుడ్లు పెట్టి పొదిగిన తర్వాత కోడిపిల్లలు పుట్టుకోస్తాయి. అలాగే, పాములు గుడ్లు పెడతాయని, వాటి నుండి వాటి పిల్లలు పొదుగుతాయని వింటుంటాం.. అయితే తేళ్లు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులు, కానీ ఈ వైరల్ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపించింది. నిజానికి ఈ వీడియోలో గుడ్డు నుండి తేలు బయటకు రావడం కనిపించింది. గుడ్డు కూడా కోడి లేదా పాముకు చెందినదిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి చెంచాతో గుడ్డును పగలగొడుతున్నాడు.. ఈ క్రమంలోనే.. అక్కడున్న టబ్‌లో చిన్న చిన్న తేళ్లు చాలా తిరుగుతున్నాయి. గుడ్డు విరిగిన వెంటనే, దాని లోపల చాలా తేళ్లు కనిపిస్తున్నాయి. వాటిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు వీడియోని మరింత వైరల్ గా మార్చేస్తున్నారు.
ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, ఇదేలా సాధ్యం అనుకుంటూ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒక జంతువుకు గుడ్లు లేకపోతే, గుడ్ల నుండి ఇన్ని తేళ్లు ఎలా వచ్చాయి? ఈ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bilal.ahm4d అనే ఐడి పేరుతో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 50 వేలకు పైగా వీక్షించారు. అయితే వందలాది మంది వీడియోను లైక్ చేసారు.
ఈ వీడియోను చూసిన చాలా మంది ప్రజలు భిన్నమైన స్పందనలు తెలియజేశారు. అన్ని తేళ్లు గుడ్డు లోపలికి ఎలా వచ్చాయంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, మరొక వినియోగదారు ఇది భయానక దృశ్యమని రాశారు. అయితే, కొంతమంది వినియోగదారులు మాత్రం ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టి పారేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..