‘జీవితం చాలా చిన్నది.. ప్రతీ నిమిషాన్ని ఎంజాయ్ చేయాలి’ అన్నది సామెత.. అలాగే మన జీవితంలో దొరికే ప్రతీ సంతోషానికి కచ్చితంగా ఏదొక మూల్యం చెల్లించాల్సిందేనని అంటుంటారు పెద్దలు. తాజాగా ఇలాగే ఓ యువకుడు తన లవర్‌ను సీక్రెట్‌గా కలవడానికి ఆమె ఇంటికి వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ కట్ చేస్తే.. అనూహ్యంగా ఆ యువతి తల్లిదండ్రులు ఇంటికి రావడంతో.. ఆ యువకుడు చివరికి ఒంటి మీద బట్టల్లేకుండా.. బాల్కనీ నుంచి.. ఏముంది.! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వీడియోలో చూసెయ్యండి.! కచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడు బట్టల్లేకుండా ఓ బాల్కనీ నుంచి పొడవాటి వస్త్రం పట్టుకుని కిందకు దిగుతుండటం మీరు చూడవచ్చు. పై నుంచి ఒక అమ్మాయి.. అతడి బట్టలను కిందకు విసిరేసింది. అతడిని పట్టుకునేందుకు ఆ అమ్మాయి తండ్రి ప్రయత్నించగా.. ఎలాగోలా ఆ యువకుడు తప్పించుకున్నాడు. ఇక కింద అంతస్తులో ఓ మహిళ.. ఆ యువకుడ్ని చీపురు పట్టుకుని కొడుతుంటుంది. ఈ ఘటన అంతటిని స్థానికులు రికార్డు చేయగా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr
— Enezator (@Enezator) August 10, 2023
ఈ వీడియోను ‘Enezator’ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి ఇప్పటివరకు 4.7 మిలియన్ల వ్యూస్ వచ్చింది. అలాగే 42 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. కాగా, నెటిజన్లు దీనిపై వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ప్రేయసి కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడని’ కొందరు కామెంట్ చేయగా.. ‘సీక్రెట్‌గా ఇలాంటి పనులు చేస్తే.. మూల్యం చెల్లించక తప్పదు’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరైతే ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. మరి మీ సంగతేంటి.? వీడియోపై ఓ లుక్కేయండి.
True 😂
— Cloe (@Chloe202242) August 10, 2023
Bro is hanging for life pic.twitter.com/e6OsDpJtN8
— Vineel Vasireddi (@VineelVasireddi) August 10, 2023
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..