Shocking: పాదచారుడి మొబైల్ ఎత్తుకెళ్లిన దొంగ.. క్షణాల్లో మైంబ్ బ్లాంక్ సీన్.. షాకింగ్ వీడియో చూసేయండి..

రోజు రోజుకు జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఛాన్స్ దొరికితే చాలు.. అందినకాడికి కాజేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని,

Shocking: పాదచారుడి మొబైల్ ఎత్తుకెళ్లిన దొంగ.. క్షణాల్లో మైంబ్ బ్లాంక్ సీన్.. షాకింగ్ వీడియో చూసేయండి..
Mobile Robbery

Updated on: Nov 06, 2022 | 6:27 AM

రోజు రోజుకు జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఛాన్స్ దొరికితే చాలు.. అందినకాడికి కాజేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని, జనం తంతారనే భయం అసలే వారిలో లేదు. పొరపాటున ఒకసారి ప్రజలకు దొరికితే.. కొట్టి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటిది.. ఆ భయం కూడా లేకుండా పట్టపగలే, జన సమూహాలనే అడ్డాగా చేసుకుని బరితెగిస్తున్నారు. ఇలాంటి చోరీలకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ చోరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తొలుత.. ఒరి నీ బడవ అని తిట్టుకున్నా.. ఆ తరువాత అయ్యో పాపం అని నిట్టూరుస్తున్నారు. మరి ఇంతకీ అందులో ఏముందో తెలుసుకుందామా..?

దొంగలు చోరీ చేయడంలో ఒకసారి విజయం సాధించొచ్చు.. రెండోసారి విజయం సాధించొచ్చు.. అయితే అన్ని వేళలా అది సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సార్లు చోరీ చేసి విజయవంతంగా తప్పించుకున్నప్పటికీ.. ఏదో ఒక సందర్భంలో మాత్రం చిక్కక తప్పదు. తాజగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే విషయం ఉంది. అయితే, ఇందులోని దొంగకు టైమ్ చాలా బ్యాడ్ ఉన్నట్లుంది. అలా దొంగిలించిన మరుక్షణంలోనే అతను ఆస్పత్రి పాలయ్యేలా ఘోర ప్రమాదానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి షాపు వద్ద నిల్చుని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దొంగ.. ఆ ఫోన్‌ను లాగేసుకుని పరారయ్యాడు. దొంగ తాను దోచుకున్న ఫోన్‌ను తీసుకుని రోడ్డుకు అవతలివైపు పరుగులు తీశాడు. ఇంతలో సడెన్‌గా వచ్చిన కారు.. అతన్ని ఢీకొట్టింది. దాంతో అతను ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అలా దోపిడీ చేసిన క్షణాల్లోనే.. దొంగ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫోన్ యజమాని.. ఆ దొంగ వద్దకు వచ్చి తన ఫోన్ తాను తీసుకుని వెళ్లిపోయాడు. దొంగను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @ViciousVideos పేరుతో ఉన్న అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 6 సెకన్ల వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షిస్తున్నారు. దొంగకు జరగాల్సిందేనంటూ శాపాలు పెడుతున్నారు. మరికొందరు సానుభూతి చూపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..