ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయాన్ని పరిచయం చేస్తాయి. మరికొన్ని అయితే వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెట్టింట కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దామా..
వైరల్ వీడియో ప్రకారం.. సర్కస్‌లో ఓ వ్యక్తి మొసలితో కొన్ని విన్యాసాలు చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. మొసలి నోరు తెరుచుకుని ఉండగా.. ఏకంగా దాని నోట్లోకే తలపెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఒక మూడు సెకన్లు.. ఆ వ్యక్తి మొసలి నోట్లో తలపెట్టి.. బయటకు వస్తాడు. బహుశా..! ఆ మొసలి లంచ్ బ్రేక్‌లో ఉన్నట్లుంది. అందుకే అతడికి ఎలాంటి హాని చేయదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. క్రూర జంతువులతో ఆటలు ఆడొద్దని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు అనవసరంగా ప్రమాదానికి ఎదురెళ్లుతున్నావ్ అంటూ మండిపడ్డారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.